ఏదైనా పొగడాలంటే సినిమా వాళ్ల తర్వాతే అని మరోసారి రుజువు చేశారండి.అల్లు వారి రెండో అబ్బాయి శిరీష్ తన సినిమా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నాడు అంతే ఇక ఆ సినిమాను సూపర్ హిట్ చేసే ఆలోచనతో రెండు రోజులకొకసారి ఎవరినో ఒకరిని పిలవడం సినిమా గురించి మాట్లాడేలా చేయడం ఇదే శ్రీరసు శుభమస్తు టీం పని అయ్యింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీరసు శుభమస్తు మంచి టాక్ తెచ్చుకుంది.అయితే సినిమా ఎలాగు హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి దాన్ని ఇంకా ప్రేక్షకులకు చేరువయ్యేలా నిర్మాత అల్లు అరవింద్ సినిమా ప్రమోషన్స్ ను ఇంకా బాగా పెంచేశాడు.
రీసెంట్ గా ఈ సినిమా గురించి దాసరి నారాయణ రావు, సుకుమార్, వినాయక్ లు మాట్లాడటం జరిగింది.అందరు అల్లు హీరోని ఆకాశానికెత్తేయడం పనిగా పెట్టుకున్నారనుకోండి.
ఇక వారిలో సుకుమార్ ఇంకాస్త ముందుకెళ్లి బన్నిని శిరీష్ ఓ విషయంలో బీట్ చేసేశాడు.వాయిస్ మాడ్యులేషన్, తెలుగు క్లారిటీగా మాట్లాడటం లాంటి విషయాల్లో మూడో సినిమాకే శిరీష్ అల్లు అర్జున్ ను బీట్ చేసేశాడన్నారు.
తమ్ముడి కోసం అన్నను కాస్త తగ్గించి మాట్లాడాడు సుకుమార్.ఎలాగు పొగిడింది తమ్ముడినే కదా అని బన్ని కూడా సైలెంట్ గా ఉండొచ్చనుకోండి.
కాని బన్ని కన్నా శిరీష్ బెటర్ అన్న సుక్కు మాటలకు ఆపండి లెక్కల మాష్టారు మీ జోకులు మీరు అనేస్తున్నారు నెటిజెన్లు.
.