అఖిల్ సినిమా కోసం విక్రం ట్విస్ట్..!

అదేంటి అఖిల్ సినిమా కోసం తమిళ హీరో విక్రం ట్విస్ట్ ఏంటి అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఇక్కడ విక్రం అంటే మనం, 24 డైరక్టర్ విక్రం అన్నమాట.

 Vikram Twist For Akhil Second Movie-TeluguStop.com

మొదటి సినిమా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన అఖిల్ రెండో సినిమా ముహుర్తం మాత్రం బయట పడలేకపోతుంది.వంశీ పైడిపల్లి, హను రాఘవపుడి అంటూ సాగిన చర్చలు ఇప్పుడు మూడో డైరక్టర్ విక్రం కుమార్ అంటూ వార్తలు వస్తున్నాయి.

అవును అఖిల్ తన సెకండ్ సినిమాగా విక్రం కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడని టాక్.మనం సినిమాతో అక్కినేని కుటుంబానికి దగ్గరైన విక్రం కుమార్ కు అఖిల్ భాధ్యతలను అప్ప చెప్పేశాడట నాగార్జున.

ఇప్పటికే నాగ్, విక్రంల మధ్య ఈ విషయంపై డిస్కషన్స్ జరిగాయట.సో అఖిల్ సినిమా రేసులో ఇప్పుడు విక్రం కుమార్ కూడా వచ్చి చేరాడన్నమాట.

మొదటి సినిమా అంచనాలను అందుకోలేదని తీయబోయే సెకండ్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఇలా దర్శకులను మార్చుతూ వస్తున్నారు.ఇప్పటికే అఖిల్ సినిమా వచ్చి పది నెలలు దాటిపోతుంది.

ఇంకా దర్శకుల వేటలోనే ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ.మరి ఫైనల్ గా అఖిల్ ఎవరికి ఓటేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ అయ్యింది.

ఇక ఇక్కడ మరో విషయం ఏంటంటే అఖిల్ మొదటి సినిమా అసలు విక్రం కుమార్ చేయాల్సిందట కాని ఏవో కారణాల వల్ల అలా కుదరలేదు.అయినా సరే మనం లాస్ట్ సీన్ లో అఖిల్ కు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు విక్రం కుమార్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube