ఇంటిలో దుర్వాసన లేకుండా ఉండాలంటే.

వర్షాకాలంలో తేమ కారణంగా ఇంటి లోపల దుర్వాసన రావటం సహజమే.సమస్య నుండి బయట ఆపడటానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.

 Really Bad Smell When It Rains?-TeluguStop.com

ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

వెనిగర్

వెనిగర్ బ్యాక్టీరియా,దుర్వాసన,క్రిములను పోగొట్టటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

నాలుగు వంతుల నీటిలో ఒక వంతు వెనిగర్ వేసి బాగా కలిపి స్ప్రే సీసాలో పోసి గదుల్లో స్ప్రే చేయాలి.వంటగదిలో వచ్చే ఘాటైన వాసనలను కూడా వెనిగర్ తరిమికొడుతోంది.

బేకింగ్ సోడా

కార్పెట్ లను శుభ్రం చేసినప్పుడు కార్పెట్ కింద కొంచెం బేకింగ్ సోడా జల్లితే దాన్నించి ఎటువంటి దుర్వాసన రాదు.రాత్రి సమయంలో ఇల్లంతా బేకింగ్ సోడా జల్లి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.

నిమ్మకాయ

రెండు ముగ్గుల నీటిలో నాలుగు నిమ్మకాయల తొక్కలు వేసి మరిగిస్తే వచ్చే ఆవిరి వలన ఇంటిలో దుర్వాసన పోతుంది.ఆ నీటిలో దాల్చినచెక్క,లవంగాలు వేసి చల్లారాక వడకట్టి స్ప్రే సీసాలో నిల్వ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube