కుక్కలని పెంచుకుంటే ఎన్ని లాభాలో చూడండి

కుక్క విశ్వాసానికి ప్రతీక అని అంటారు.అందుకే ఏళ్లుగా కుక్కలని తన నేస్తం చేసుకున్నాడు మనిషి.

 Advantages Of Having A Pet Dog-TeluguStop.com

ఇప్పుడు కుక్కలని కేవలం విశ్వాసంగా ఉంటాయని, రక్షణగా ఉంటాయని పెంచుకోవట్లేదు.ఈరోజుల్లో కుక్కలని పెంచుకోవడం కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది.

కుక్కలని ఎందుకు పెంచుకోవాలో, పెంచుకుంటే మనకు దొరికే లాభాలేంటో ఓ లుక్కేసి చూడండి.

* క్యాన్సర్ ని పసిగట్టే శక్తి కుక్కలకు ఉంటుంది.

మీ శరీరభాగంలో ఎక్కడైతే క్యాన్సర్ పెరుగుతోందో, అక్కడ అవి పదే పదే వాసన చూడటం, నాకటం లాంటివి చేస్తూ ఉంటాయి.

* కుక్కలు మనల్ని ఉత్సాహావంతంగా, ఉల్లాసంగా ఉంచుతాయి.

అవి ఎలాగో ఉన్నచోట ఉండవు.ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి.

అలాగే మనల్ని విసిగించైనా సరే, బద్దకంగా ఓచోట కూర్చోనే అవకాశం లేకుండా చేస్తుంటాయి.

* కుక్కలను పెంచుకునే మనుషులు సంతోషంగా, నవ్వుతూ ఉండే అవకాశాలు ఎక్కువ.

ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు వారి చేష్టలకు ఎప్పుడూ నవ్వతూ ఉంటాం.కుక్కలు ఎప్పటికీ పిల్లలే.

అవి కూడా చిలిపి పనులు చేస్తూ నవ్విస్తాయి.

* చైనాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కుక్కలను పెంచుకునే వారిలో కొలెస్టెరాల్ లెవెల్స్ తక్కువుంటాయట.

గుండె ఆరోగ్యంగా ఉంటుందట.

* కుక్కలు రోగనిరోధకశక్తి పెంచుతాయని కూడా కొన్ని పరిశోధనలు చెబితున్నాయి.

ఎందుకంటే కుక్కలు రకరకాల బ్యాక్టిరియాను మోసుకొస్తాయి.వాటితో పోరాడేందుకు శరీరంలో ఇమ్యూనిటి కూడా పెరుగుతుంది.

* కుక్కలు పెంచుకునే వారు ఒంటరితనాన్ని ఫీల్ అవడం తక్కువగా జరుగుతుంది.అందువల్ల డిప్రేషన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

* ఇంతకుముందు చెప్పినట్టుగానే, కుక్కలు సోషల్ స్టేటస్ ని పెంచుతాయి.ఇంట్లో కుక్క ఉందంటే అదో స్టేటస్ సింబల్.

అదీకాక ఎవరు పడితే వారు మన ఇంటికి రావాలంటే జంకుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube