నిద్రలేమికి ముఖ్య కారణం అవి

చెన్నై నివాసి అశోక్ వయసు 20 ఏళ్ళు.గ్యాడ్జెట్లకి బాగా అలావాటు పడిపోయి “ఇన్సోమ్నియా”, అంటే నిద్రలేమి సమస్యను కొనితెచ్చుకున్నాడు.

 Gadgets Are Main Cause Of Insomnia-TeluguStop.com

రోజూ ఒక జపానిస్ కార్టూన్ ని తన మొబైల్ లో చదవేవాడట.దాంతో రాత్రిళ్ళు నిద్రకు దూరమయ్యాడు.

దాంతో అతనికి ఇన్సోమ్నియా వచ్చేసింది.రోజుకి, అతి కష్టం మీద 4 గంటల నిద్రపోయే దుస్థితి.

ఇలా కేవలం అశోక్ మాత్రమే కాదు.వేలమంది టినేజ్/యూత్ ది ఇదే పరిస్థితి.

మొబైల్ ఫోన్స్, టాబ్లెట్లు, కంప్యూటర్స్ … ఇలా ఏది అందుబాటులో ఉంటే దాన్ని రాత్రిళ్ళు వాడటం అలవాటు చేసుకుంటున్నారు.

ఈ సమస్యపై చెన్నై అపోలో హాస్పిటల్స్ లో సైకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ భారతీ విశ్వేస్వరన్ మాట్లాడుతూ ” పిక్చర్స్, కలర్ లో మార్పులు జరిగినా కొద్ది మైండ్ ఆసక్తిగా వాటిని గమనిస్తుంది.

అదే పద్ధతిలో వేగంగా పనిచేస్తుంది మెదడు.ఇక దానికి విశ్రాంతినివ్వడం కష్టమైన పని.మనం సోషల్ నెట్వర్కింగ్ లో ఒక పోస్టు పెడితే, దానికి ఎంతోకొంత రెస్పాస్ వస్తుంది.ఎవరేం కామెంట్ చేసారబ్బా అని మాటిమాటికి మొబైల్ వైపే చూస్తాం.

వచ్చిన ప్రతీ కామెంట్ ఫోన్ తీసి జవాబిస్తాం.అలా అలా కొన్నిగంటల పాటు ఆ పోస్టు మీ ముగ్గురు, నలుగురు రెస్పాండ్ అవుతూ ఉంటారు.

ఇక నిద్ర ఎక్కడ పడుతుంది.సరిపడ నిద్ర శరీరానికి ఇవ్వాలంటే రాత్రి అవగానే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుంచి లాగవుట్ అవడం ఉత్తమం ” అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube