ఆరు సినిమాలు 550 కోట్ల డీల్ తో సూపర్ స్టార్..!

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ స్టార్ టివితో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.బాలీవుడ్ హ్యాండ్సం హీరో హృతిక్ వరుస ఆరు సినిమాల శాటిలైట్ రైట్స్ మొత్తంగా 550 కోట్లకు డీల్ కుదుర్చుకుందట స్టార్ టివి.

 Hrithik Big Deal With Star Tv About His Movie Satellite-TeluguStop.com

ప్రస్తుతం నటిస్తున్న మొహెంజొదారో సినిమా 90 కోట్లకు శాటిలైట్ అయ్యిందని టాక్.అయితే ఇది కాకుండా తన ప్రొడక్షన్లో వస్తున్న కాబిల్ తో కలుపుకుని వరుస ఆరు సినిమాలకు టోటల్ 550 కోట్లట.

అయితే భవిష్యత్ లో శాటిలైట్ రైట్స్ రూపంలో సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయని స్టార్ టివి ముందుగా హృతిక్ తో ఈ ఒప్పందం చేసుకుంది.ఇక ఓ పక్క సల్మాన్ ఖాన్ కూడా ఇదే విధమైన డీల్ తో ఓ చానెల్ తో సంప్రదింపులు చేస్తున్నాడట.

సో బాలీవుడ్ సినిమా గురించి హీరోతో మాట్లాడాలంటే శాటిలైట్స్ గురించి నిర్మాత మర్చిపోవాల్సిందే.మరి ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ రైట్స్ మన దగ్గర ఏ స్టార్ హీరో ఇంతటి బిగ్ డీల్ కుదుర్చుకుంటాడో చూడాలి.

మన దగ్గర సినిమాకు 10 కోట్లు పెట్టడమే కష్టం అవుతుంటే ఏకంగా వందల కోట్లు పెట్టేస్తున్నారంటే స్టార్ టివి గట్స్ కు మెచ్చుకోవాల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube