పిల్లలను ఆ రకంగా కూడా గమనించాలి

పిల్లలు రోజూ స్కూలుకి వెళుతున్నారో లేదో గమనిస్తారు.హొమ్ వర్క్ చేస్తున్నారో లేదో గమనిస్తారు.

 Encourage Your Child To Participate In Extra Curricular Activities-TeluguStop.com

పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో గమనిస్తారు.కాని మీ పిల్లలు స్కూలులో జరిగే ఆటలపోటిలలో పాల్గొంటున్నారా లేదా ? స్టేజి అంటే భయపడుతున్నారా లేక ఎక్కేసి మాట్లాడుతున్నారా, డ్యాన్స్, డ్రామా .ఇలాంటి విషయాల్లో పోటి పడుతున్నారా లేదా అని ఎప్పుడైనా గమనించారా ? చాలామంది తల్లిదండ్రులకి ఇవి అనవసరమైన విషయాలుగా కనిపిస్తాయి.కాని భవిష్యత్తును నిర్మించే విషయాలు ఇవి.

ఆటలంటే నలుగురితో కలవాలి, మాట్లాడాలి.వాటిలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది.

పిల్లలు నాయకత్వ లక్షణాలు ఇక్కడే దొరుకుతాయి.ఆటగాళ్లకు గవర్నమెంటు ఉద్యోగాలు ఎందుకు ఇస్తుంది ? ఈ కారణంతోనే కదా.మీ పిల్లలను ఆటలాడుకోనివ్వకపోతే , ఎంతో అపకారం చేసినవారవుతారు.ఈరోజు ఏ కంపెని అయినా, నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే ఉద్యోగాలు కట్టబెడుతోంది.

చిన్నప్పుడు పదిమంది ముందు మాట్లాడటం అలవాటు చేయకపోతే, స్టేజి అంటే భయం ఏర్పడి, పదిమందిలో మాట్లాడాలంటే బెదురు, నిలుచోవాలంటే భయం ఏర్పడుతాయి.ఈ భయాల వల్లే ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవుతూ ఉంటారు.

అందుకే అన్నారు మొక్కగా ఉన్నప్పుడే వంచాలి అని.చిన్నప్పుడే స్టేజి అంటే భయం పోగొట్టాలి.డ్యాన్స్, స్పీచ్, డ్రామా .ఇలాంటి పోటిలలో పిల్లలు పాల్గొనేల ప్రోత్సహించాలి.స్కూలులో చురుగ్గా ఉంటున్నారా లేక మొక్కుబడిగా పరిక్షలు రాస్తున్నారా అనేది గమనించాలి.అప్పుడే వారి బంగారు భవిష్యత్తుని నిర్మించగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube