ముద్దు పెడుతున్నప్పుడు కళ్ళు ఎందుకు మూస్తారు ?

సినిమాలో ముద్దు సన్నివేశాలు తిరగేసి చూస్తారో, మీరే మీ భాగస్వామిని ముద్దు పెట్టుకొని ప్రయత్నిస్తారో, ముద్దు పెట్టుకున్తున్నప్పుడు మనం కళ్ళు మూసేస్తాం.కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకోవడం అసంభవం అని కాదు .

 Why Do We Close Our Eyes While Kissing ?-TeluguStop.com

అలా కూడా పెట్టుకోవచ్చు.కాని కనులు మూసి పెడితే వచ్చే మజా, కనులు తెరిచి పెడితే రాదు.

నిజంగా, రానే రాదు.మరి దీనిలో దాగున్న మర్మం ఏమిటి ?

ఒకవేళ మీరు ఏదైనా ఊహించుకోవాలంటే కనులు తెరిచి ఊహించుకుంటారా లేక కనులు మూసి ఊహించుకుంటారా ? కనులు మూసే కదా.కనులు తెరిచి ఊహించుకోలేం అని కాదు కాని, కనులు మూసి ఊహించుకుంటేనే ఏకాగ్రత ఉంటుంది.ముద్దుపెట్టుకోవాం కూడా అంతే.

సైకాలాజిస్టుల అధ్యయనాల ప్రకారం, ముద్దుపెడుతున్నప్పుడు టాక్ టైల్ సెన్స్ (స్పర్శ) ఎక్కువ కోరుకుంటారు ఎవరైనా.స్పర్శని లోతుగా అనుభవించాలంటే కనులు మూయాలి.

ఎందుకంటే దృశ్యం మన అనుభవాన్ని తగ్గిస్తుంది.ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుంది.

ఇది ఒక కారణం.

ఇక మరో కారణం ఏమిటంటే, ఎంత అందంగా ఉన్నా, అంత దగ్గరగా నిమిషాలపాటు ఎదుటి వ్యక్తిని చూడాలంటే ఎవరికైనా కష్టమే.

అమ్మాయిలకి మహేష్ బాబు దొరికినా, అబ్బాయిలకి దీపిక పదుకొనే దొరికినా, అది అంతే .ఈ కారణంతో కూడా కనులు మూసుకొనే ముద్దు పెట్టుకుంటారు.అందుకే అందంగా ఉండే హీరోహీరోయిన్లు అయినా, మనలాంటి మామూలు మనుషులైనా, కనులు మూసే ఆధారాల్ని జోడిస్తారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube