జగన్ కు బాగా కోపం వచ్చేసింది .. అందుకే లేక రాసిపారేసాడు     2018-08-11   10:08:18  IST  Sai Mallula

ఎప్పుడూ ఎంతో ధర్యంగా కనిపిస్తూ తన చుట్టూ కేసుల వలయం బిగిసిపోతున్నా చెరగని చిరునవ్వుతో కనిపించే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడు. తన అక్రమాస్తుల కేసుల్లో ఈడీ ఐదో నిందుతురాలిగా తన భార్య వైఎస్ భారతిని చేర్చడం జగన్ తట్టుకోలేకపోతున్నాడు. అసలు ఈ విషయం చాలా గోప్యంగా ఉండాల్సి ఉండగా మీడియాకు ఎలా లీక్ అయ్యింది అంటూ జగన్ ఎక్కడ లేని కోపం ప్రదర్శిస్తున్నాడు. వైఎస్ భారతి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చార్జిషీటు దాఖలు చేయడంతో జగన్ పూర్తిగా కంట్రోల్ తప్పి పోయారు. అంతే కాదు ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశాడు.

YS Jagan Wrote A Letter To Narendra Modi-

YS Jagan Wrote A Letter To Narendra Modi

భారతి సిమెంట్స్ పరిశ్రమ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు.. ఈడీ గుర్తించింది. ఈ మేరకు చార్జిషీట్ వేసింది. ఏ-5 నిందితురాలిగా చేర్చుతూ.. ఈడీ ఎప్పుడు చార్జిషీట్ వేసిందో తెలియదు కానీ.. మీడియాకు మాత్రం గురువారం సాయంత్రం విషయం లీక్ అయ్యింది. దీంతో ఆ వార్త కాస్త మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇంకేముంది ఇది కాస్త జగన్ లో ఆందోళన పెంచింది. కుటుంబ సభ్యులనూ రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. చార్జీషీట్ వేయలేదని.. ఓ వర్గం మీడియా మాత్రమే ప్రచారం చేస్తోందన్నారు.

శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్ కోర్టు సమయం ముగిసిన తర్వాత ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. చార్జిషీటు వేసిన విషయం తమకు కూడా తెలియదని.. చార్జిషీటును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోక ముందే.. మీడియాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయారు. బహిరంగ లేఖలో ఇద్దరు ఈడీ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారని.. వారిద్దరూ టీడీపీ ఎజెంట్లని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ఈ వ్యవహారం అంతా తెర వెనుక ఉండి చంద్రబాబు నడిపిస్తున్నాడనే భావనలో జగన్ ఉన్నాడు.

YS Jagan Wrote A Letter To Narendra Modi-

మొదట చంద్రబాబు తన తండ్రిని టార్గెట్ చేశారని.. ఆ తర్వాత తనను టార్గెట్ చేశారని.. ఇప్పుడు తన భార్యను టార్గెట్ చేశారని ఆరోపించారు. బీజేపీతో కుమ్మక్కయితే.. పరిస్థితి ఇంత వరకూ వస్తుందా.. అని జగన్ ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కయింది.. చంద్రబాబేనని ఆరోపించారు.

Attachments area