పాదయాత్రతో నాయకుడు బిజీ ... కుమ్ములాటలతో నాయకుల బిజీ బిజీ  

పార్టీ అధినేత ఒకవైపు అధికారం కోసం అహర్నిశలు కష్టపడి పోతూ ఎండనకా వాననకా జనాల్లో తిరుగుతూ పార్టీకి పరపతి పెంచే పనిలో ఉన్నాడు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఇవేవి తమకు పట్టవన్నట్టు ఎవరికి వారు కుమ్ములాటలకు దిగే పనిలో పడ్డారు. ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించే. జగన్ పాదయాత్ర జిల్లాలో జరుగుతున్నా ..
ఆ పార్టీ నేతలు మాత్రం పాదయాత్రను విజయవంతం చేయకుండా, పార్టీలో పట్టుకోసం, అధినేత ముందు తమ ఆధిపత్యాన్ని బలంగా ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కుమ్ములాటలకు దిగుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాల్ విసురుకుంటున్నారు.

YS Jagan Unhappy With The YCP Leaders In Visakhapatnam-

YS Jagan Unhappy With The YCP Leaders In Visakhapatnam

ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారన్న విషయంపై సందిగ్దత నెలకొన్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు జగన్ ముమ్మర కసరత్తులు చేస్తున్న సందర్భంలో పార్టీకి చెందిన కొందరు నేతలు, ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముందే పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వైసీపీకి తలనొప్పిగా మారారు.

జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరిన సందర్బంగా ఆ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నేతలతో విజయసాయిరెడ్డి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే యలమంచిలి నియోజకవర్గంలోని మునగపాకలో పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఒక్కసారిగా బయటపడింది.

నియోజకవర్గానికి మొన్నటి వరకు సమన్వయకర్తగా విధులు నిర్వర్తించిన బొడ్డేడ ప్రసాద్, ప్రస్తుతం టికెట్ ఆశిస్తూ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇంచార్జ్ గా నియమితులైన కన్నబాబురాజుల మధ్య దాగి ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కార్యక్రమాలకు నన్ను కావాలనే దూరం పెడుతూ అవమానిస్తున్నారని బొడ్డేడ ప్రసాద్ కన్నబాబు మీద తీవ్ర ఆరోపణలు చేసాడు. గత ఎన్నికల్లో కన్నబాబురాజు గెలుపు కోసం కృషి చేశానని, అయినా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు ఆశించి పనిచేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని వీటన్నిటికీ సంబంధించిన లెక్కలు తన వద్ద ఉన్నట్టుగా ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

YS Jagan Unhappy With The YCP Leaders In Visakhapatnam-

గత ఎన్నికల్లో జగన్ కు ఎక్కువ డోనేషన్ ఇచ్చింది కూడా తానేనని, ఇకపై ఎవరి మాట లెక్కచేయబోనని ఎవరెన్ని కుట్రలు పన్నినా, తన గెలుపును ఆపడం ఎవరితరం కాదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు కన్నబాబు. దీంతో బొడ్డేడ ప్రసాద్ వర్గం ఒక్కసారిగా ఆందోళనకు దిగింది. దీంతో ఇరువురి నేతలపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.