ఆ కులం ఓట్లు జగన్ కి అవసరం లేదా ..?     2018-09-18   10:15:44  IST  Sai Mallula

కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండడంతో పాటు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. ఒకదశలో పార్టీ బాగా బలం పుంజుకుంది అనుకుంటున్నా సమయంలో జగన్ దూకుడు నిర్ణయాలు అమాంతం ఆ క్రెడిట్ ని వెనక్కి గెంటేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగిన అంశాలు ఏంటంటే… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం, రెండోది కాపు రిజర్వేషన్లపై వ్యతిరేక ప్రకటనలు చేయడం. ఈ రెండు ఘటనలతో కాపు సామాజికవర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకమయింది. జనసేన ప్రభావంతో కాపు నేతలు ఎవరూ వైసీపీ కి ఓటు వేయరని కోణంలో జగన్ ఆలోచిస్తూ కాపులను దూరం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Ys Jagan Negalted Kapu Vote Bank-

Ys Jagan Negalted Kapu Vote Bank

అలాగే మరో కీలక అంశంలోనూ జగన్ ఈ విధంగానే తొందరపడ్డట్టు కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధానే పోటీ చేస్తారు అని జగన్ ప్రకటించాడు. దానికి తగ్గట్లుగానే వంగవీటి రాధా క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా పాదయాత్ర విశాఖకు చేరే లోపు.. జగన్ మనసు మార్చుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఓట్లు అత్యధికంగా ఉంటాయి కాబట్టి..ఆ స్థానానికి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాధా వర్గం భగ్గుమంటోంది. విజయవాడలో వైసీపీ ఫ్లెక్సీలు అన్ని తీసి పక్కనపడేసి పరిస్థితి వరకు అక్కడ పరిస్థితి వచ్చేసింది.

Ys Jagan Negalted Kapu Vote Bank-

జగన్ ఉద్దేశపూర్వకంగానే వంగవీటి రాధాకృష్ణను నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీలో అందరూ గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి వంగవీటి రాధాకృష్ణను యాక్టివ్ చేసుకుని ఉంటే.. పవన్ కల్యాణ్ ప్రభావం కొద్దిగా అయిన వైసీపీపై పడకుండా ఉండేది. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కాపుల ఓట్లు తనకు రావని.. పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉన్నారన్న భావన అంతటా వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే. ఆయన వ్యవహారశైలి కనిపిస్తోందంటున్నారు వైసీపీ నేతలు.ఇటీవల ఐవైఆర్ కృష్ణారావు, రమణదీక్షితుల వివాదాల కారణంగా బ్రాహ్మణులు చంద్రబాబుకు దూరమయ్యారని.. వారంతా.. వైసీపీకి అనుకూలంగా మారారని జగన్ భావిస్తున్నారు.

అందుకే ఇప్పుడు మల్లాది విష్ణుకి టికెట్ ఇచ్చి బ్రాహ్మణ ఓట్లు కొల్లగొట్టాలని జగన్ ప్లాన్. అయితే బ్రాహ్మణ ఓట్లు విజయవాడ సెంట్రల్‌లో ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు జగన్ తెలుసుకున్నాడా… మల్లాది విష్ణు ఇప్పుడే పార్టీలో చేరారా..? కాదు కదా. జగన్‌కు అన్నీ తెలుసు అన్నీ తెలిసే.. వంగవీటికి అప్పట్లో టిక్కెట్ ప్రకటించారు కానీ ఇప్పుడు దూరం పెడుతున్నారు.