బాబుకి ఐదు పెళ్లిళ్లు .. ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు ! జగన్ సంచలన వ్యాఖ్యలు     2018-08-21   04:23:15  IST  Sai Mallula

ఏంటో ఇప్పుడు రాజకీయాల్ని పెళ్లిళ్ల చుటూ .. పెళ్ళాల చుట్టూ తిరుగుతున్నాయి. హుందాగా విమర్శలు చేసుకునే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలపైనా కామెంట్లు చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. ఇక ఈ విషయాల గురించి కాసేపు పక్కనపెడితే టీడీపీ అధినేత చంద్రబాబు నాడు మీద వైసీపీ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా కోటరవుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ బాబు పని తీరుపై నిప్పులు చెరిగారు.

అంతే కాదు సీఎం చంద్రబాబు ఐదు పెళ్లిళ్లు చేసుకుని వదిలేశారని, ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధం అవుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సభకు హాజరయిన కొంతమంది షాక్ కి గురయ్యారు. ఏంటి జగన్ చెప్తుంది నిజమేనా అన్నట్టు చూసారు. కానీ జగన్ చెప్పింది చంద్రబాబు ఇప్పటికి ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని , ఇప్పుడు కాంగ్రెస్ తో ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్నాడని చెప్పాడు. 2014లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బాయ్ కాట్ చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు తిరిగేసరికి అదే కాంగ్రెస్ తో జతకడుతున్నారని మండిపడ్డారు.

YS Jagan Comments On Chandrababu Marriages-

YS Jagan Comments On Chandrababu Marriages

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన వ్యక్తికి మద్దతు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో రాయబారం కోసం తన కుటుంబ సభ్యులను పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ఐదు పార్టీలతో పెళ్లిళ్లు అయ్యాయని ఇప్పుడో ఆరోపెళ్లికోసం ఆరాట పడుతున్నారన్నారు. బీజేపీని పెళ్లి చేసుకుని వదిలేశారని అలాగే టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలను పెళ్లి చేసుకుని వదిలేశాడని ఎద్దేవా చేశారు. అలాగే జనసేన పార్టీని కూడా పెళ్లి చేసుకుని వదిలేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని, బాబు అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరని జగన్ విమర్శించాడు.