రోజు వాట్సాప్ వాడతాం…కానీ ఈ 10 సింపుల్ ట్రిక్స్ మాత్రం చాలా మందికి తెలీదు..! 6 వ ది తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు..   You Should Know About These 10 Tricks About Whatsapp     2018-09-17   11:58:43  IST  Rajakumari K

వాట్సాప్‌.. దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది వాడుతున్నారు. పాపుల‌ర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌దే అగ్ర‌స్థానం. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్ మొబైల్, వెబ్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ఇందులో కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వాట్సాప్ గురించిన ఫీచర్లు కాదు. దానికి సంబంధించిన ప‌లు ట్రిక్స్‌, టిప్స్ గురించి. అవును, అవే. వీటిని మీరు తెలుసుకుంటే వాట్సాప్‌ను ఇంకా సుల‌భంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. మరి ఆ ట్రిక్స్, టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. వాట్సాప్‌లో మీరు ఎవ‌రితో ఎక్కువ‌గా ట‌చ్‌లో ఉంటున్నారు అనే విష‌యాన్ని తెలుసుకోవాల‌ని ఉందా. అయితే ఇలా చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో ఉండే డేటా యూసేజ్ విభాగంలో ఉన్న స్టోరేజ్ యూసేజ్ ఆప్ష‌న్‌ను ఎంచుకోండి. అప్పుడు ఒక పాప‌ప్ విండో వ‌స్తుంది. అందులో మీరు ఎవ‌రికి ఎన్ని మెసేజ్ లు పంపారు, ఏ వ్య‌క్తి లేదా ఏ గ్రూప్‌లో మీరు ఎక్కువ‌గా మెసేజ్‌లు పెట్టారు, ఎవ‌రితో ఎక్కువ చాట్ చేశారు అన్న వివ‌రాలు తెలుస్తాయి.

You Should Know About These 10 Tricks Whatsapp-


2. వాట్సాప్‌లో చాటింగ్ చేసేట‌ప్పుడు డేట్‌, టైం, లేదా ఏదైనా వెబ్‌సైట్ లింక్‌ను టైప్ చేస్తే అవి క్లిక‌బుల్ లింక్‌లుగా క‌నిపిస్తాయి గ‌మ‌నించారు క‌దా. అయితే వాటిని క్లిక్ చేస్తే ఫోన్ క్యాలెండ‌ర్‌లో ఆ రోజున‌, ఆ స‌మ‌యానికి ఈవెంట్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు.

You Should Know About These 10 Tricks Whatsapp-


3. వాట్సాప్‌లో అవ‌త‌లి వారు పంపిన మెసేజ్‌కు ఫాస్ట్‌గా రిప్లై ఇవ్వాలంటే దానిపై రైట్ సైడ్‌కు స్వైప్ చేస్తే చాలు, రిప్లై వెళ్తుంది.

You Should Know About These 10 Tricks Whatsapp-


4. వాట్సాప్‌లో మీరు చాట్ చేసేట‌ప్పుడు కీబోర్డ్‌పై టైప్ చేయకుండా వాయిస్ క‌మాండ్ల ద్వారా కూడా అక్ష‌రాల‌ను టైప్ చేయ‌వ‌చ్చు. అందుకు ఐఫోన్‌లో డిజిట‌ల్ అసిస్టెంట్ సిరి ఉప‌యోగ‌ప‌డితే గూగుల్‌లో ఓకే గూగుల్ ప‌నికొస్తుంది. వాట్సాప్ మెసేజ్ టైపింగ్ బార్‌లో చివ‌ర‌న ఉండే మైక్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేసి వాయిస్ క‌మాండ్ల‌ను వినిపిస్తే చాలు, దాంతో మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా అవే టైప్ అవుతాయి.

You Should Know About These 10 Tricks Whatsapp-


5. వాట్సాప్‌ను మీరు ప‌ర్స‌న‌ల్ నోట్స్ యాప్ గా కూడా వాడుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… ఏదైన ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. దానికి మీరు అడ్మిన్ అయి ఏదైనా నంబ‌ర్‌ను యాడ్ చేయండి. అనంత‌రం ఆ నంబ‌ర్‌ను డిలీట్ చేయండి. దీంతో గ్రూప్‌లో మీరు ఒక్క‌రే ఉంటారు. అప్పుడు ఇక మీ ఇష్టం. ఆ గ్రూప్‌లో పెట్టిన‌వి మీకు మీరే చూసుకోవ‌చ్చు. అందులో టెక్ట్స్‌, ఫొటోలు, వాయిస్ నోట్స్ పోస్ట్ చేసుకోవ‌చ్చు. దీంతో ఆ గ్రూప్ నోట్స్ లాగా ప‌నికొస్తుంది.

You Should Know About These 10 Tricks Whatsapp-


6. వాట్సాప్ ను వాడుతున్న‌ప్పుడు మీ ఫోన్ నంబ‌ర్‌ను హైడ్ చేయాలంటే మీకు రెండు సిమ్ కార్డులు కావాలి. ఒక సిమ్‌తో వాట్సాప్‌ను ముందుగా యాక్టివేట్ చేయాలి. అనంత‌రం ఆ సిమ్ తీసేసి మ‌రో సిమ్ పెట్టాలి. అప్పుడు వాట్సాప్ నంబ‌ర్ అడిగితే తీసేసిన సిమ్ నంబ‌ర్ ఇవ్వాలి. దాంతో మీరు వాడుతున్న సిమ్ నంబర్ అవ‌త‌లి వ్య‌క్తుల‌కు తెలియ‌దు.

You Should Know About These 10 Tricks Whatsapp-


7. వాట్సాప్‌లో మ‌న‌కు క‌నిపించే ఫాంట్ మాత్ర‌మే కాకుండా మ‌రో ఫాంట్‌ను కూడా వాడుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే మెసేజ్‌ను టైప్ చేయ‌డానికి ముందు మూడు కోట్స్ ( ` )ను వ‌రుస‌గా ఇవ్వాలి. అనంత‌రం టెక్స్ట్ టైప్ చేసి సెండ్ చేయాలి. దీంతో ఆ అక్ష‌రాలు టైప్ రైట‌ర్ ఫాంట్‌లోకి మారుతాయి. అవి అలాగే అవ‌త‌లి వారికి సెండ్ అవుతాయి.

You Should Know About These 10 Tricks Whatsapp-


8. వాట్సాప్‌లో ఓ పెద్ద సీక్రెట్ జిఫ్ లైబ్రరీ కూడా ఉంది. దాన్ని ఎలా యాక్సెస్ చేయ‌వ‌చ్చంటే.. ఏదైనా చాట్‌లోకి వెళ్లి అక్క‌డే కింది భాగంలో ఎడ‌మ వైపుకు ఉండే + ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే పాప‌ప్ మెనూలో క‌నిపించే ఫొటో అండ్ వీడియో లైబ్ర‌రీ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అందులో కింది భాగంలో ఎడ‌మ వైపు ఉండే జిఫ్ (GIF) అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. దీంతో భారీ సంఖ్య‌లో జిఫ్‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి. వాటిని వాట్సాప్‌లో మీరు ఎవ‌రికైనా పంప‌వ‌చ్చు.

You Should Know About These 10 Tricks Whatsapp-


9. మీ ఫోన్‌లో ఉన్న వీడియోల‌ను మీరు జిఫ్‌లుగా మార్చుకోవాలంటే అందుకు వాట్సాప్ ప‌నికొస్తుంది. అందుకు ఏం చేయాలంటే… పైన 8వ టిప్‌లో చెప్పిన‌ట్టుగానే ఏదైనా చాట్‌లోకి వెళ్లి అక్క‌డే కింది భాగంలో ఎడ‌మ వైపుకు ఉండే + ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే పాప‌ప్ మెనూలో క‌నిపించే ఫొటో అండ్ వీడియో లైబ్ర‌రీ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అందులో ఏదైనా వీడియోను ఎంచుకోవాలి. అయితే ఆ వీడియో సైజ్ 64 ఎంబీని మించ‌కూడ‌దు. వీడియోను సెలెక్ట్ చేసుకున్నాక వీడియో ఎడిటింగ్ వ్యూలోకి వెళ్లి వీడియోను 5 సెక‌న్లు, అంత‌క‌న్నా త‌క్కువ నిడివి ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ త‌రువాత దాన్ని జిఫ్‌గా మార్చుకోవ‌చ్చు.

You Should Know About These 10 Tricks Whatsapp-


10. ఒక గ్రూప్ చాట్‌లో వ‌చ్చే మెసేజ్‌ల‌ను ఎవ‌రెవ‌రు చ‌దివారో, ఎవ‌రెవ‌రు చ‌ద‌వ‌లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… ఏదైనా మెసేజ్‌పై లెఫ్ట్‌కు స్వైప్ చేయాలి. దీంతో ఆ మెసేజ్‌ను ఎవ‌రు చ‌దివారో, ఎవ‌రు చ‌ద‌వ‌లేదో తెలుస్తుంది. అయితే అవ‌త‌లి వారు రీడ్ రిసీట్స్‌ను డీ యాక్టివేట్ చేసినా స‌రే దీంతో వారు ఆ మెసేజ్‌ను చ‌దివారో, లేదో తెలుసుకోవ‌చ్చు.

You Should Know About These 10 Tricks Whatsapp-