వైసీపీ టూ జనసేన..వలసలే వలసలు .. మేలుకో జగన్

ఏపీలో అత్యంత కీలకమైన తూర్పుగోదావరి జిల్లా అన్ని పార్టీలకు ఎంతో కీలకం.ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా బలంగా ఉంటుంది.

 Ycp Mlas Migration In To Janasena-TeluguStop.com

ఇక్కడ ఇప్పటివరకు టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలమైన పునాదులే వేసుకున్నాయి.ముఖ్యంగా వైసీపీ ఇక్కడ బలంగా పాతుకుపోయింది అనుకుంటున్నా సమయంలో జనసేన పార్టీ రాజకీయంగా బలపడుతుండడంతో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి.

వైసీపీ టూ జనసేన అన్నట్టుగా నాయకుల వలసలు ఇక్కడ ఆ పార్టీని కలవరపెడుతున్నాయి.దీనికి ప్రధాన కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సామజిక వర్గానికి చెందిన కాపుల జనాభా ఎక్కువ ఉండడంతో నాయకులు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారు.

నాయకులు ఎక్కువగా వచ్చి పార్టీలో చేరుతుండడంతో.జనసేనలో కూడా జోష్ పెరుగుతోంది.ఆ స్పీడ్ అలాగే కొనసాగిస్తూ.తమ పార్టీ తరుపున పోటీ చేసే తొలి అభ్యర్థిని పవన్‌ ప్రకటించారు.ఏపీలో 19 సీట్లతో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి కీలకంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్టే కనిపిస్తోంది.ఇక్కడ నిన్నటి వరకు అధికార టీడీపీకి ధీటుగా ఉన్న విపక్ష వైసీపీ జనసేన ఎంట్రీతో చాలా నియోజకవర్గాల్లో బలహీనపడింది.

జనసేన దూకుడుతో వైసీపీ క్రమక్రమంగా బలహీనపడుతోంది.నిన్నమొన్నటి వరకు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న పలువురు జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు.

వైసీపీలో రాజకీయ భవిష్యత్తు లేకపోవడం, సీటుపై గ్యారెంటీ లేకపోవడంతోనే వీళ్లంతా జనసేనను ఆశ్రయిస్తున్నారు.

కాకినాడ సిటీలో కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీ సయన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి ముత్తా శశిధర్‌ తనయుడు ముత్తా గోపాలకృష్ణ తన తండ్రితో కలిసి జనసేనలోకి జంప్‌ చేసేశారు.

అలాగే గత ఎన్నికల్లో మండపేటలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన గిరజాల వెంకటస్వామినాయుడు కూడా.జనసేనలోకి జంప్‌ చేసేసారు.రాజమహేంద్రవరం గ్రేటర్‌ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్‌ ఇటీవల జనసేనలోకి జంప్‌ చేసిన సంగతి తెలిసిందే.వచ్చే రెండు నెలల్లో తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో మరింత అనూహ్య పరిణామాలు సంభవిస్తాయని, ఆ పార్టీ మరింత దిగజారుతుందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇక వైసీపీ నుంచేకాకా ఇతర పార్టీలో కీలక నేతల సైతం జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు.

ఇక వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సంగిసెట్టి అశోక్‌ సైతం జనసేనలోకి జంప్‌ చేసి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామికవేక్త చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి జంప్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.ఇక మాజీ మంత్రి జిల్లా వైసీపీకి కీలకంగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అడుగుల సైతం టీడీపీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది.

బలమైన నాయకులంతా ఇప్పుడు వలస బాట పడుతుండడంతో జిల్లాలో వైసీపీ గందరగోళ పరిస్థితుల్లో ఉంది.తక్షణమే జగన్ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయంగానే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube