టెక్సాస్..శాస్త్రవేత్త అద్భుతం....గిన్నిస్ రికార్డు     2018-08-30   14:48:55  IST  Bhanu C

ఒక వ్యక్తి యొక్క విజ్ఞానం ఆ వ్యక్తిని ప్రపంచానికి పరిచయమ చేస్తుంది..ఎంతో మందికి స్పూర్తివంతమైన వ్యక్తిగా నిలుస్తాడు..ఎన్నో రికార్డులు చుట్టుముడుతాయి..అందుకు నిదర్సనమే అమెరికాలోని శాన్‌ ఆంటోనియోలో గల టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సౌతిక్‌ బెటల్‌ అనే శాస్త్రవేత్త.. సౌతిక్‌ బెటల్‌ ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉండేవారు ఎన్నో విజయాల్ని సైతం ఆయన నమోదు చేసుకున్నారు అయితే

Worlds Smallest Medical Robot Hits Guinness Book Of World Records-

Worlds Smallest Medical Robot Hits Guinness Book Of World Records

ప్రపంచంలోనే అతిచిన్న రోబోను సృష్టించిన సౌతిక్ ఈ సారి మాత్రం గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 120 నానో మీటర్లు మాత్రమే ఉన్న ఈ రోబో ఎన్నో అద్భుతాలు చేస్తుందని దీనిలో ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయని దీనిని రూపొందించడానికి గల ముఖ్యమైన ఉద్దేశ్యం ఆయన వివరిస్తూ భవిష్యత్తులో క్యాన్సర్‌, అల్జీమర్స్‌ రోగులకు వరంలాంటిదని ప్రొఫెసర్‌ రుయాన్‌ గ్యువో పేర్కొన్నారు.

Worlds Smallest Medical Robot Hits Guinness Book Of World Records-

అయితే ఈ రోబోను ఉపయోగించి మానవశరీరంలో కోరుకున్న కణాన్ని లక్ష్యంగా చేసుకుని మందులను వాటిపై ప్రయోగించవచ్చునని తెలిపారు..క్యాన్సర్‌ కణితులు, అల్జీమర్స్‌కు కారణమయ్యే మెదడులోని న్యూరాన్లపై ప్రయోగించవచ్చునని తెలిపారు..అంతేకాదు రోబోల పైభాగం అంతర్భాగం తయారీకీ బహుళ పనులుచేసే రెండు వేర్వేరు ఆక్సైడ్‌ పదార్థాలను ఉపయోగించారు.