ఈ చెప్పుల ఖరీదెంతో తెలిస్తే కళ్లు తిరిగిపడిపోతున్నారు.. కేవలం 123 కోట్ల రూపాయలే..   World's Most Expensive Shoes Made Of Diamonds, Gold Costs 17 Million     2018-09-26   10:56:01  IST  Rajakumari K

మీరు వేసుకునే చెప్పుల రేటు ఎంతుంటుంది.. వంద రూపాయలనుండి స్టార్ట్ చేస్తే మహా అంటే రెండువేల వరకు ఉండొచ్చు.కానీ ఈ చెప్పుల ధర ఎంతో తెలుసా అక్షరాల 123.41కోట్ల రూపాయలు..కోటో,లక్షో చెప్తేనే అంత రేటా అని ముక్కున వేలేసుకుంటాం..అలాంటిది మరీ 123కోట్ల రూపాయల చెప్పులేంటి అనుకుంటున్నారా..ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలు.. ఎందుకు అంత రేటో తెలియాలంటే చదవాల్సిందే..

మేలిమి బంగారంతో పాటు వజ్రాలు పొదగడం వల్లే ఈ చెప్పులకు అంత రేటు..బంగారంతో నగలు చేయించుకుంటారు..వజ్రపుటుంగరాలు చేయించుకుంటారు కానీ చెప్పులు చేయించుకోవడం ఏంటి కొత్తగా అనుకుంటున్నారా..మనుషులకు బంగారం మీద ఉన్న మోజు ఎంతో మీకు కొత్తగా చెప్పక్కర్లేదు…దానికి తోడు బాగా డబ్బున్నవాళ్లు ఇలాంటి వాటిపై ఇష్టం చూపించడం కూడా ఆ కంపెని వారికి ప్లస్ పాయింట్..దీన్నే క్యాష్ చేసుకోవాలని ఇలా కొత్తరకం చెప్పులతో ముందుకొచ్చారు. యూఏఈలో ఉన్న ప్రపచంలోని ఏకైక 7 స్టార్ హోటల్ ‘బుర్జ్ అల్ అరబ్’లో బుధవారం వీటిని ఆవిష్కరించనున్నారు..

World's Most Expensive Shoes Made Of Diamonds  Gold Costs 17 Million-

యూఏఈలోని ప్రముఖ బ్రాండింగ్ సంస్థ ‘జాదా దుబాయ్‌’, జ్యువెలరీ సంస్థ ‘ప్యాషన్‌ జువెలర్స్‌’ సంయుక్తంగా ఈ ఖరీదైన పాదరక్షలను తయారుచేశారు. వీటి తయారీకి ఏకంగా 9నెలల టైం పట్టింది..ఒకవేళ మీకు ఈ చెప్పులు కావాలంటే అంత డబ్బు చెల్లించి,మీ కాలు సైజ్ ఇస్తే మీకు తగ్గట్టుగా తయారుచేస్తారు. ప్యాషన్ డైమండ్ షూ ఖరీదు స్థానిక ధర ప్రకారం 62.4 దిర్హమ్స్, అమెరికా మనీ ప్రకారం 17 మిలియన్ అమెరికన్ డాలర్లు. కాగా, భారత కరెన్సీలో వీటి ధర 123 కోట్లు ఉంటుదని ఆ సంస్థ వెల్లడించింది..