విఐపీ ల సెక్యురిటీ గార్డ్స్ ని ఎప్పుడైనా గమనించారా?వాళ్లెప్పుడూ నల్లకళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా??   Why Security Guards Of VIPs Always Wear Black Sunglasses     2018-09-09   13:00:59  IST  Rajakumari K

వీఐపీలు ఉన్నచోటల్లా వాళ్ల సెక్యురిటి గార్డ్స్ ఉంటారు….సెక్యురిటీ గార్డ్సు ప్రతి ఒక్కరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు…ఎప్పుడైనా గమనించారా..లేదంటే ఈ సారి గమనించండి…సెక్యురిటీస్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడమనేది స్టైల్ కొ..వాళ్ల సేఫ్టీ కొ కాదు…దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి…అవేంటంటే…

వీఐపీలు వస్తున్నారంటే వాళ్లను చూడడానికి చాలా మంది మనుషులు వస్తారు … కొన్ని సార్లు కొన్ని గొడవలు జరగొచ్చు…సెక్యురిటీ గార్డ్స్ అందరిని గమనిస్తుంటారు..కానీ వాళ్లు గమనిస్తున్నారన్న విషయం ఎదుటివాళ్లకు తెలియకుండా ఉండ‌డం కోసం గ్లాసెస్ పెట్టుకుంటారు..

Why Security Guards Of VIPs Always Wear Black Sunglasses-

సడన్ గా బాంబ్ బ్లాస్ట్స్ జరగొచ్చు..లేదా ఎవరైనా కాల్పులు జరపొచ్చు….ఆ టైం లో వాళ్లు కళ్లు మూసుకుంటే పరిస్థితి తెలిదు.. అలాంటప్పుడు మూసుకోకుండా ఉండి పరిస్థితిని గమనించడానికి ఆ పర్సన్ ను ఎదుర్కోవడానికి తోడ్పడతాయి..

సెక్యురిటీ గార్డ్స్ ట్రెయినింగ్ లో ఉన్నప్పుడే వాళ్లకి మనుషుల బాడీ లాంగ్వెజ్ ని గుర్తించడానికి శిక్షణ పొందుతారు..సో ఎక్కడైనా మనుషుల కదలికలు కొంచెం తేడాగా అన్పించినా వాళు ఈజీగా గుర్తుపట్టేస్తారు…వీళ్లు గమనిస్తున్న విషయం అవతల మనిషికి తెలియకుండా ఉండడంలో ఈ గ్లాసెస్ ఉపయోగపడ్తాయి. అంతేకాదు సెక్యురిటీ గార్డ్స్ డ్యూటిలో ఉన్నప్పుడు సంభంవించే పెద్ద పెద్ద గాలులు లాంటి వాటినుండి కళ్ల రక్షణకు తోడ్పడతాయి..