తెలంగాణాలో జనసేన దారేది ..? అసలు స్పందన ఏది   Why Pawan Kalyan Silent Over Telangana Elections     2018-09-08   12:35:27  IST  Sai M

తెలంగాణాలో ఎన్నికల సందడి మొదలయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అయిపోతున్నాయి. కొత్త రకాల పొత్తులు, కొత్త కొత్త అభ్యర్థులు తెరమీదకు వస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు తమదే అన్నట్టు కస్టపడుతున్నారు. ఇవన్నీ ఎన్నికల తంతులో భాగమే. అయితే ఇప్పుడు ఈ సందడిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వస్తోంది. ఎన్నికల సందడి తెలంగాణలో మొదలయిపోయినా పవన్ పార్టీ నుంచి మాత్రం ఏ విధమైన స్పందన కనిపించడంలేదు. ఏపీలోనే ఇంకా జనసేన పుంజుకోకపోయినా.. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేందుకు సై సై అంటోంది.

ఏపీలో రాజకీయాధికారం కోసం పోరాడుతున్న జనసేనాని తెలంగాణ రాజకీయాలపై ఎలా స్పందిస్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తెలంగాణలో ప్రతిపక్షం కాంగ్రెస్ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతుండగా.. టీడీపీ మాత్రం డైలమాలో ఉంది. కేసీఆర్ తో సాన్నిహిత్యం నెరుపుతున్న బీజేపీ ఇంకా ఎటూ తేల్చుకోకుండా ఉంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ తాను పోటీ చేస్తానని ఇది వరకు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ముందస్తు నిర్ణయంపై ఇప్పటి వరకూ స్పందించ లేదు. పవన్ కళ్యాణ్ జనసేనకు ఇప్పటికీ ఏపీలో క్యాడర్ లేదు. ఫ్యాన్స్ బలంతో ప్రజల్లో ఉన్న క్రేజ్ తోనే ఆయన ఏపీలో ప్రచార పర్వాన్ని నెట్టుకొస్తున్నారు.

తెలంగాణాలో పవన్ కు ఉన్న రాజకీయ బలం ఎంత అనేది ఇప్పటివరకు ఒక అంచనా దొరకలేదు. జనసేనాని పవన్ తెలంగాణలో పోటీ చేస్తారా.? కేసీఆర్ ప్రభంజనానికి ఎదురు నిలబడతారా అన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీ లు కూడా తెలంగాణ రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేసీఆర్ సాధారణ ఎన్నికల వరకు వేచి చూసి ఉంటె పరిస్థితి వేరేగా ఉండేది కానీ ఆయన తొందరపాటుగా అసెంబ్లీని రద్దు చేయడంతో అన్ని పార్టీల్లోనూ… కంగారు కనిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలతో పాటే వెళితే పవన్ కూడా అప్పటి వరకూ రంగం సిద్ధం చేసుకునే వారేమో! ఏపీతోపాటు తెలంగాణలోని పలు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేవాడేమో!. కానీ ఇప్పుడు ముందస్తుతో పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పడ్డారు. ఏపీలోనే ఇంకా స్పష్టమైన క్లారిటీ రాణి జనసేన పార్టీకి తెలంగాణాలో పోటీ అంటే కట్టి మీద సామే.

Why Pawan Kalyan Silent Over Telangana Elections-

ఇక ఎన్నికలకు ఏంటో సమయం లేనందున పవన్ ఎదో ఒక నిర్నయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే పార్టీకి ఇంకా ఎన్నికల గుర్తు దక్కలేదు. తెలంగాణాలో పోటీకి దిగితే ఆ గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా అక్కడ రాజకీయ ప్రస్థానం ప్రారంభించే కంటే ఎదో ఒక పార్టీతో జత కట్టి ముందుకు వెళ్తే ఎన్నికల్లో జనసేన ప్రభావం కొంచెం అయినా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం టీఆర్ఎస్ పార్టీ తో జనసేన జత కట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.