పరీక్షలో ప్రశ్నగా 'ఫసక్'..సోషల్ మీడియాలో వైరలవుతున్న బిటెక్ ప్రశ్నాపత్రం..   Who Is Use Pasak Word, Malla Reddy College Question Paper     2018-09-24   09:58:59  IST  Rajakumari K

”ఫసక్”ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలైన టాపిక్ ఏదన్నా ఉందంటే అది ఫసక్కే.. ఎడమ చేతిని అడ్డంగా ఊపుతూ తనదైన స్టైల్లో ‘ఫసక్’ అనే మాటని వాడారు. ఆ మూడక్షరాల మాట ఇప్పుడు తెలుగు నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. ఈ మాట మీద వందలకొద్దీ మీమ్స్, స్పూఫ్‌లు పుట్టుకొచ్చేశాయి.ఇంకా ఇంకా వస్తున్నాయి..ఈ ఫసక్ సోషల్ మీడియాను ఇప్పట్లో వదిలిపోయేలా లేదు.. తను యథాలాపంగా పలికిన ఆ ఒక మాట ఇంత వేగంగా వైరల్ కావడంతో మోహన్‌బాబు కూడా ముగ్ధుడయ్యారు…దీనిపై మోహన్ బాబు ,మంచుమనోజ్ కూడా స్పందించారు.. అయితే ఇప్పుడు ఈ ఫసక్ గురించి ఒక పరీక్షలో ప్రశ్నగా రావడం చర్చనీయాంశం అయింది..

“ఫసక్” అన్న పదం ఫస్ట్ వాడిందెవరు? అనేది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రశ్నాపత్రంలోని ప్రశ్న.కాగా….ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే…ఫసక్ క్వశ్చన్ అడగడమే కామెడి అంటే, పస్ట్ అన్నదేవరు అనే ప్రశ్నకు ఆప్షన్స్ చూస్తే నవ్వాపుకోవడం కష్టం..ఆ ఆఫ్షన్స్ ఏంటంటే..

1.మోహన్ బాబు 2.చిరంజీవి

3.నరేంద్రమోదీ 4.సంపూర్ణేష్ బాబు

నటుల జాబితాలో నరేంద్రమోడీని చేర్చినందుకు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది ..ఇది అసల్ ఫసక్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతుంటే..బిటెక్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం ఏంటి,.దేశానికి గొప్ప ఇంజినీర్లను ఇలాంటి ప్రశ్నలతోనే తయారు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.