ఫార్వర్డ్ మెసేజ్ లపై కోత విధించిన వాట్సప్...కారణం ఏంటో తెలుసా?     2018-08-09   10:22:30  IST  Rajakumari K

పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు,దొంగల ముఠా,చెడ్డీ గ్యాంగ్ అంటూ రకరకాల ప్రచారాలు..వాటికి సోషల్ మీడియా యాప్ అయిన వాట్సప్పే ప్రధాన వేధిక..ఒక మెసేజ్ వస్తే అది నిజమో కాదో తెలుసుకోకుండా నిమిషాల్లో వందల మందికి ఫార్వర్డ్ చేయడమే..అలా తప్పుడు మెసేజ్లు సెండ్ చేయడం వలన ఇప్పటివరకు పాతికమందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు..ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ఫార్వర్డ్ మెసేజ్లపై కోత విధించింది వాట్సప్..

WhatsApp Officially Rolls Out Forward Message Limit For Indian Users-

WhatsApp Officially Rolls Out Forward Message Limit For Indian Users

పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారంటూ మెసేజ్ ఫార్వర్డ్ అవ్వడంతో అనుమానంగా కనిపించిన వ్యక్తుల్ని చితకబాది,ఆఖరికి వారి ప్రాణాలను సైతం బలిగొన్న ఘటనలు ఎన్నో గతేడాది.. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం వాట్సాప్‌ను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తప్పుడు వార్తలను అరికట్టేందుకు వాట్సాప్‌.. ఫార్వర్డ్‌ చేసే సందేశాలపై పరిమితి విధించింది. ఇందులో భాగంగానే ఇక నుంచి వాట్సాప్‌ మెసేజ్‌లు ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్‌ చేసేలా కోత విధించింది. ఇప్పటి వరకు దాదాపు 20 మంది వ్యక్తులకు లేదా గ్రూపులకు ఒకేసారి ఫార్వర్డ్‌ మేసేజ్‌ను పంపించేందుకు సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని భారత్‌లో ఐదుకు మాత్రమే చేర్చింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతను తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని, అలాగే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తామని వాట్సాప్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.కేవలం భారత్‌లో వాట్సాప్‌ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తించనుంది.