ఉద్యమం మాది .. ఊరేగేది మీరా ... టీఆర్ఎస్ లో కొత్త లొల్లి     2018-08-11   09:47:14  IST  Sai Mallula

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం కస్టపడి ఉద్యమంలో పాల్గొన్న వారిని పట్టించుకోవడం మానేసి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్ద పీట వెయ్యడం, వారిని కనీసం పట్టించుకోకపోవడం ప్రస్తుతం కీలకంగా భావిస్తున్న ఎన్నికల సమయంలో ఈ అంశం తెరమీదకు వచ్చి రచ్చ జరగడం టీఆర్ఎస్ లో గందరగోళం సృష్టిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన వారు అంతా ఇప్పడు ప్రాధాన్యత లేకుండా పోవడం వారికి కనీసం చిన్నపాటి పదవి కూడా దక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

What Is This KCR...Party Getting Inner Allegations-

What Is This KCR...Party Getting Inner Allegations

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలను దృషిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దీంతో కారు పార్టీకి కొంతవరకు మైలేజ్ పెరిగింది. ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులంతా టీఆర్ఎస్ లో చేరారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో వలస వచ్చిన నాయకులంతా జట్టుగా మారి వారి అనుచరులకే టికెట్లు ఇచ్చుకునే పనిలో పడ్డారు. దీంతోమొదటి నుంచి టీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికి మరోసారి అన్యాయం జరగబోతోందనే ఆవేదన టీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీ జెండాలు మోసిన వారికంటే.. వలస వచ్చిన వారే ముందు వరుసలో నిలవడం.. అధిష్టానం కూడా వారి మాటనే వింటుండడంతో టీఆర్ఎస్ కింది స్థాయి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారంతా ఇప్పటికీ టీఆర్ఎస్ ను నమ్ముకునే ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ప్రస్తుతం పట్టించుకునేవారే కరువయ్యారు. బంగారు తెలంగాణ కోసమంటూ టీఆర్ఎస్ లో చేరిన వారికే ప్రస్తుతం ప్రాధాన్యత దక్కుతోంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులు మంత్రులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడా అయ్యారు. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న వారికి సరైన గుర్తింపు లేదని కింది స్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు.

What Is This KCR...Party Getting Inner Allegations-

కనీసం నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కింది స్థాయి నేతల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వారికి కనీసం తమ నాయకుడిని కలుసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.ఇటీవలే ఈ అసంతృప్తిని తగ్గించడానికి మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో జిల్లా నేతలతో అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించారు. వారిని బుజ్జగించేందుకు వివిధ హామీలు కూడా ఇచ్చారు అయినా ఫలితం మాత్రం కనిపించే పరిస్థితి కనిపించడంలేదు.