ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటున్నారా??  

ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో,ఎందుకు తింటున్నామో..ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తున్నాము.అసలు మన శరీరానికి ఏం అవసరం,ఏవి అనవసరం అనేవి పట్టించుకోకుండా కడుపులో కొంత పడేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది కొందరి పరిస్థితి..ఎలా తింటున్నారనేది కాసేపు పక్కన పెడితే ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఏం తినకూడదో తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కొంచెం వరకు కాపాడుకోవచ్చు.కాబట్టి పరగడపున ఏం తినకూడదో తెలుసుకోండి.

కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లిపోతారు. అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి ముందు కూడా ఇలాగే చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు.

What Is The Best Thing To Eat On An Empty Stomach-

What Is The Best Thing To Eat On An Empty Stomach

చాలా మంది నిద్రలేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. పొద్దున వాటిని తాగడం మంచిదే. కానీ పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమం. వీటిల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట గ్లాస్ నీళ్లు తాగి ఓ పది నిమిషాల తరువాత వీటిని తీసుకుంటే మంచిది.

ఉదయం లేవగానే పండ్లు తింటుంటారు చాలామంది..కాని పరగడుపున పండ్లు తినకూడదు.ముఖ్యంగా అరటి పండలు జోలికి వెళ్లకూడదు. అరటి పండులో మెగ్నిషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

What Is The Best Thing To Eat On An Empty Stomach-

పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా టమాటాలను పరగడుపున తీసుకోరాదు. చాలా మంది టమాటా బాత్ లేదా టమాటా రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే ముందు కొన్ని పాలు తాగడమో, వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి.

ఆలస్యంగా నిద్ర లేచినప్పుడు, అలవాటులో భాగంగానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివి బాధిస్తాయి. వీటన్నింటి కంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.

ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరల్ని ఉదయం పూట, అదీ పరగడుపున తీసుకోకూడదు. పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. అదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధన్యం ఇవ్వాలి.