పవన్ నీ దారెటు..? నువ్వూ గుంపులో గోవిందేనా..!!!  

ఏపీ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తెస్తా అంటూ గొంతు చించుకుని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆదిశగానే అడుగులు వేస్తాడు అనుకున్నారు అందరూ అయితే పవన్ కళ్యాణ్ రూట్ సపరేటు కాదు అనే విషయం అతి తొందరలోనే బయటపడింది..పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన పంధాని పూర్తిగా మార్చుకున్నారు సగటు రాజకీయ నేతగానే మాట్లాడారు హామీలు గుప్పించారు తప్ప ఎక్కడా కూడా తన సిద్దంతాలని ఫాలో కాలేదని చాలా సులభంగా అర్థం అవుతోంది…పవన్ మాట్లాడిన ,ఇచ్చిన హామీలు అందరికీ తెలిసినవే అయితే..ఈ హామీల అమలు ఎంతవరకూ సాధ్యం..? కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారం పవన్ ఎలా డీల్ చేస్తారు..? మహిళా రిజర్వేషన్లు విషయంలో పవన్ కళ్యాణ్ హామీ ఎంతవరకూ సాధ్యం..?

What Is Pawan Kalyan Political Strategy-

What Is Pawan Kalyan Political Strategy

సరికొత్త రాజకీయాలని ప్రజలకి పరిచయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రజలని అందరి రాజకీయ నాయకులు లాగానే మోస పూరిత ,ఆచరణ సాధ్యం కానీ హామీలని ఇవ్వటం చూస్తుంటే పవన్ స్టాండ్ ఏమిటో చాలా సులభంగా అర్థం అవుతోంది…ఇక ఇచ్చిన హామీల విషయాన్ని గమనిస్తే, రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం, తదితర సరుకుల విషయంలో నాణ్యత లేని కారణంగా ఇక లబ్ది దారులకి ఏకంగా ప్రతీనెలా వారి వారి ఖాతాలలో 2500-3 వేల మధ్య డబ్బునే బదిలీ చేస్తానని హామీ ఇచ్చేశారు..మన గ్యాస్ ఎవరో తీసుకుంటున్నారు అది అడ్డుకోగలిగితే ఉచిత గ్యాస్ ఇవ్వటం పెద్ద కష్టం కాదు అంటూ హామీలు గుప్పించారు.. అయితే కేజీ బేసిన్ గ్యాస్ ను గుజరాత్ కు పోకుండా అడ్డుకోవటం జరిగే పనేనా ? కేజీ బేసిన్ నుండి గ్యాస్ అడ్డుకోవటం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వల్లే కాలేదు..మరి పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అయ్యే పనేనా..

What Is Pawan Kalyan Political Strategy-

ఇక అత్యంత వివాదాస్పదమైన కాపుల రిజర్వేషన్ అంశంపై కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ…కాపులను బిసిల్లో చేర్చే అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చుచుతారట…అయితే ఇదేమంత సాధ్యం అయ్యే పని కాదు పవన్ కళ్యాణ్ చేతుల్లో పని కూడా కాదు..చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్న హామీ కూడా సాధ్యం కాదు. చట్టసభలంటే అసెంబ్లీ, పార్లమెంటే. మహిళా బిల్లు పార్లమెంటులో దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉందన్న విషయాన్ని పవన్ మరిచిపోయినట్లున్నారు. బిసిలకు 5 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించే అంశంపై కూడా హామీ ఇచ్చారు…అసలు కాపులని బీసీల్లో చేర్చగలిగే అంశం ఆచరణ సాధ్యం అవునా కాదా అనేది కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ దూకుడుకు నిదర్సనంగా చెప్పవచ్చు.

పవన్ ఇచ్చిన హామీలలో చాలా వరకూ కేంద్రం తో ముడిపడి ఉన్నవే అయితే రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలైతే ఏదో రకంగా అమలుకు ప్రయత్నం చేయవచ్చు కానీ రిజర్వేషన్లు విషయంలో పవన వేలు పెట్టి అసలుకే మోసం తెచ్చుకుంటాడేమే అని తెగ కంగారు పడుతున్నారు పార్టీ నేతలు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ దూకుడు నిర్ణయాలు పార్టీ పై తీవ్రమైన ప్రభావం చూపుతాయి అదే సమయంలో ప్రజలలో జనసేనపై నమ్మకం కోల్పోయేలా చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు.