విజయ్‌ దేవరకొండ ఇందులో కూడా వదల్లేదా.. ముద్దులే ముద్దులు   Vijay Deverakonda To Go Back To Arjun Reddy Mood With NOTA Movie     2018-09-06   10:36:55  IST  Ramesh P

యువ హీరో విజయ్‌ దేవరకొండ యూత్‌ ఐకాన్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమాపై కూడా ప్రస్తుతం ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి సక్సెస్‌ను దక్కించుకున్నా కూడా ఆ చిత్రం సక్సెస్‌ ఏదో గాలి వాటం సక్సెస్‌గా అంతా భావించారు. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సంచలన విజయాన్ని దక్కించుకుంది. అర్జున్‌ రెడ్డి సక్సెస్‌కు ప్రధాన కారణం అందులో యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ముద్దులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంది. గీత గోవిందంలో కూడా ముద్దు సీన్స్‌ ఉన్నాయి. అందుకే విజయ్‌ దేవరకొండ తన తదుపరి చిత్రాల్లో కూడా ముద్దు సీన్స్‌ ఉండాలని ముందే దర్శకులకు చెబుతున్నాడేమో. తాజాగా ఈయన నటించిన ద్విభాష చిత్రం ‘నోటా’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో కూడా ముద్దు సీన్స్‌ ఉన్నాయంటూ తాజాగా విడుదలైన ప్రీ టీజర్‌లో తేలిపోయింది.

Vijay Deverakonda To Go Back Arjun Reddy Mood With NOTA Movie-

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘నోటా’ చిత్రం ట్రైలర్‌ను నేడు అంటే సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రంకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే నెల 4న దసరా కానుకగా విడుదల కాబోతున్న నోటా చిత్రంలో ముద్దు సీన్స్‌ ఉన్నాయి అంటూ చెప్పేందుకు ట్రైలర్‌లో ముద్దు సీన్‌ను పెట్టడం జరిగింది. విజయ్‌ దేవరకొండకు ముద్దు సీన్స్‌ సెంటిమెంట్‌గా వస్తున్నాయి. ముద్దు సీన్స్‌ ఉంటే ఆ సినిమా సక్సెస్‌ అంటూ అంతా నమ్ముతున్నారు. మరి నోటా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంటుందా అనే విషయం చూడాలి.