విజయ్‌ దేవరకొండకు పెద్ద చికొచ్చి పడిందే.. ఏం చేయాలో అర్థం కావడం లేదట!       2018-09-12   13:12:09  IST  Ramesh P

యువ సంచలనం విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. దాదాపు 70 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున వసూళ్లు సాధించిన విజయ్‌ దేవరకొండ తాజాగా ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. తమిళంలో కూడా ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

-

నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంను అక్టోబర్‌ 4న విడుదల చేయాలని భావించారు. కాని వారం రోజుల్లోనే ఎన్టీఆర్‌ మూవీ రాబోతున్న కారణంగా సినిమాను వెంటనే తొలగిస్తారని, అలా చేస్తే మంచి వసూళ్లు మిస్‌ అవుతామని అనుకుంటున్నారట. దాంతో సినిమాను అక్టోబర్‌ 18న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తమిళంలో అదే తేదీన విశాల్‌ హీరోగా తెరకెక్కిన మూవీ విడుదలకు సిద్దం అవుతుంది. ఆ కారణంగానే విడుదల తేదీ విషయంలో దర్శకుడు కిందా మీదా పడుతున్నట్లుగా తెలుస్తోంది.

-

ఇప్పటికే విడుదలైన ‘నోటా’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు దాదాపుగా 50 కోట్ల బిజినెస్‌ చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప భారీ వసూళ్లు నమోదు కావు. అందుకే జాగ్రత్తగా విడుదల తేదీని ప్లాన్‌ చేస్తున్నారు. పోటీ లేని సమయంలో విడుదల చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. అందుకే తేదీ విషయంలో మరీ మరీ ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.