విజయ్‌ ట్యాక్సీ ఇంకా ఇంకా ఆలస్యం... రాజకీయ నేపథ్యంలో     2018-08-28   08:42:48  IST  Ramesh Palla

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న గీత గోవిందం చిత్రంకు ముందే ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అర్జున్‌ రెడ్డి విడుదలైన వెంటనే ట్యాక్సీవాలా చిత్రంను హడావుడిగా పూర్తి చేశారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసిన ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించి, పబ్లిసిటీ కూడా చేశారు. కాని ట్యాక్సీవాలా కంటే గీత గోవిందం విడుదల అయితేనే బాగుంటుందని అల్లు అరవింద్‌ నిర్ణయించి, ఆ చిత్రాన్ని ఆపేశాడు. గీత గోవిందం చిత్రం వచ్చిన తర్వాత అయినా ట్యాక్సీవాలా వస్తుందని అనుకున్నారు. కాని ఇంకా ఇంకా ఆలస్యం వస్తూ వస్తుంది.

‘ట్యాక్సీవాలా’ చిత్రంతో విజయ్‌ దేవరకొండ రాబోతున్నాడు అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ తదుపరి చిత్రంగా ‘నోటా’ విడుదల కాబోతుందట. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘నోటా’ చిత్రంపై విజయ్‌ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ట్యాక్సీవాలా చిత్రంపై నమ్మకం లేని కారణంగానే ఇంకా ఇంకా ఆలస్యం చేస్తూ వస్తున్నారు.

Vijay Devarakonda Taxiwala Movie Release Postponed-

Vijay Devarakonda Taxiwala Movie Release Postponed

ట్యాక్సీవాలా చిత్రాన్ని అసలు థియేటర్లలో విడుదల చేయాలని విజయ్‌ దేవరకొండకు లేదు. ఆ చిత్రంను డైరెక్ట్‌గా ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల చేసి, కొన్నాళ్లకు శాటిలైట్‌లో ప్రసారం చేసేయాలని ఆయన భావిస్తున్నాడు. ట్యాక్సీవాలా నిర్మాతల కోసం తక్కువ బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని చేస్తాను అంటూ చెబుతున్నాడట. ఈ విషయంపై క్లారిటీ అయితే లేదు కాని ట్యాక్సీవాలా చిత్రంపై నమ్మకం లేని కారణంగానే వాయిదా వేస్తున్నట్లుగా ఆ చిత్రంలో నటించిన ఒక నటుడు చెప్పుకొచ్చాడు.

గీత గోవిందం 100 కోట్లు వసూళ్లు చేసి విజయ్‌ దేవరకొండ స్థాయిని అమాంతం పెంచింది. ఇలాంటి సమయంలో ‘ట్యాక్సీవాలా’ వచ్చి ఫ్లాప్‌ అయితే విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ మూడు నాళ్ల ముచ్చటే అవుతుంది. అందుకే ట్యాక్సీవాలా చిత్రంను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. విజయ్‌ ట్యాక్సీవాలా అసలు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు తక్కువే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. గీత గోవిందం హడావుడి తగ్గి, ఆ సక్సెస్‌ను ఫుల్‌ ఎంజాయ్‌ చేసిన తర్వాత ట్యాక్సీవాలా విడుదలకు విజయ్‌ ఓకే చెప్తాడనే టాక్‌ కూడా వినిపిస్తుంది.