విజయ్‌ ఆ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు  

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీతగోవిందం’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. మొదటి అయిదు రోజుల్లో ఏకంగా 30 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం పలు రికార్డులను నమోదు చేసింది. చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంను మరో రికార్డు వరించింది. ఇప్పటి వరకు అతి కొద్ది సినిమాలే దక్కించుకున్న 100 కోట్ల రికార్డును ఈ చిత్రం కూడా సొంతం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

Vijay Devarakond Gets Record On Geetha Govindam Movie-

Vijay Devarakond Gets Record On Geetha Govindam Movie

ఇండస్ట్రీకి వచ్చి సుదీర్ఘ కాలం అయ్యి, స్టార్‌ హీరోలుగా గుర్తింపు దక్కించుకున్న వారికి కూడా ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్‌లో స్థానం దక్కలేదు. కాని కేవలం నాలుగు సినిమాలతో విజయ్‌ దేవరకొండ ఏకంగా సూపర్‌ స్టార్‌లకే సాధ్యం అయిన రికార్డును దక్కించుకుంది. ఈ చిత్రం ముందు ముందు మరెన్ని రికార్డులను దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంతో హీరో విజయ్‌ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగి పోయింది. గీత గోవిందంకు ముందు రెండు మూడు కోట్ల రూపాయల పారితోషికాలు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పది కోట్ల పారితోషికం అయితేనే నటిస్తాను అంటున్నాడు.

వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోలు వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటి రికార్డును దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్నాడు. కేవలం రెండు వారాల్లోనే 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వసూళ్లు సాధ్యం అయ్యాయి అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడంతో పాటు, మంచి థియేటర్లలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ విడుదల చేయడం వల్లే ఇంత భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అంటున్నారు.

Vijay Devarakond Gets Record On Geetha Govindam Movie-

ఇక ఈ చిత్రంతో దర్శకుడు పరుశురామ్‌ మరియు హీరోయిన్‌ రష్మిక కూడా స్టార్‌డంను దక్కించుకున్నారు. ఈ వారం రాబోతున్న నర్తనశాల మరియు పేవర్‌ బాయ్‌ చిత్రాల ఫలితాన్ని బట్టి గీత గోవిందం కలెక్షన్స్‌ ఉంటాయి. ఆ సినిమా ఫలితం అటు ఇటు అయితే ఖచ్చితంగా సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ముందు ముందు ఈ గోవిందం ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.