విక్టోరియా.. ప్రభుత్వ సలహాదారుగా... తెలుగు ఎన్నారై     2018-08-31   16:36:14  IST  Bhanu C

తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే తమ ప్రతిభతో పాటుగా నమ్మకాన్ని కూడా సంపాదించుకుంటారు..తమదైన శైలిలో అత్యంత ప్రతిభ కలిగిన వాళ్ళుగా దేశ విదేశాలలో కీలకమైన పదవులని అలంకరిస్తూ ఉంటారు…ఎంతో మంది ప్రభుత్వాలో అత్యంత ఉన్నతమైన పదవులలో నియంపింపబడుతూ ఉంటారు..ఈ రకమైన పరిస్థితి ఎన్నో సందర్భాలలో జరిగింది కూడా అయితే..

Victoria Government Hold Indian NRI As Legal Advisor-

Victoria Government Hold Indian NRI As Legal Advisor

తాజాగా యాదాద్రి నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడిన సాయిని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తిని విక్టోరియా రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమించింది…తాళ్లగూడానికి చెందిన ఆయన..2008లో ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్‌లో న్యాయవిద్య అభ్యసించి, అక్కడే న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. మెల్‌బోర్న్‌ నేషనల్‌ వర్చువల్‌ యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఆయన సేవలను గుర్తించి..ఆయన గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

Victoria Government Hold Indian NRI As Legal Advisor-

ఈ క్రమంలోనే ఆయనకీ 2017లో ఆస్ట్రేలియా ప్రభుత్వం యొక్క పౌరసత్వం లభించింది. రాజకీయంగా చురుగ్గా ఉన్న ఆయనను విక్టోరియా రాష్ట్రం, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది…దాంతో ఆయన భంధువులు స్నేహితులు మొత్తం యాదాద్రి ప్రజలు అందరూ ఈ తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు..ఆయన తల్లి తండ్రుల సంతోషాన్ని వ్యక్తం చేశారు..