ఆ లోపమే బాలుడి పాలిట శాపమైంది.! తాంత్రికుడు చెప్పాడని సంపదల కోసం బలిద్దాం అనుకున్నారు.! చివరికి.?     2018-09-03   10:35:55  IST  Sai Mallula

చేతులకు 12 వేళ్లు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడం ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. మూఢనమ్మకాల పేరుతో బంధువులే ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కలకలం రేపింది. లోపంతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే సంపద కలిసి వస్తుందని ఓ తాంత్రికుడు అతని బంధువులకు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుడిని చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లితండ్రులు కొడుకును కాపాడుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. కనీసం ఆ బాలుడిని బడికి కూడా పంపడంలేదు. పోలీసులను కూడా ఆశ్రయించారు.

UP Boy Has 12 Fingers  Toes Relatives Want Him Dead-

UP Boy Has 12 Fingers, 12 Toes Relatives Want Him Dead

దీనిపై బారాబంకి పోలీసు అధికారి ఉమాశంకర్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఆ బాలుడు చదుకోవడానికి పోలీసులు సహాయం చేస్తారని చెప్పారు. ఆ బాలుడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇక్కడ బాధ్యతలు నిర్వహించినంత కాలం బాలుడి చదువుకయ్యే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. అంతేకాదు బాలుడిని చంపాలి అనుకున్న వారిపై విచారణ మొదలుపెడతాం అన్నారు.