ఒకప్పటి ఈ విలన్ గుర్తున్నారా.? ఆయన పిల్లలు కూడా నటులే..! ఎవరో తెలుసా.?     2018-08-22   10:09:10  IST  Sai Mallula

ఆది, ఖుషీ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మేటి విలన్ అనిపించుకున్న మలయాళ నటుడు రాజన్ పి.దేవ్.ముఖ్యంగా మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌కు బ్రేక్‌నిచ్చిన “ఆది”లో రాజన్ నటన మరువలేనిది. అలాగే “ఖుషీ”లో పవన్ కల్యాణ్ చెప్పింది విని చిటికెలేసి టైం అయిపోయింది బండి తీయండ్రా అంటూ చెప్పే విలనిజం రాజన్ సొంతం..రాజన్ తండ్రి నాటకరంగానికి చెందిన వాడు కాగా కొడుకు సినిమా రంగంలోనే ఉన్నాడు..

Unknown Facts About Villain Rajan P Dev And His Son's-

Unknown Facts About Villain Rajan P Dev And His Son's

రాజన్ కేరళలోని అలప్పుఝాలోని చేర్తలా ఊర్లో మలయాళ నాటకరంగ నటుడైన ఎస్. జె. దేవ్, కుట్టియమ్మ దంపతులకు జన్మించారు.కేరళలో 1000కి పైగా ప్రదర్శనలు ఇవ్వబడిన కట్టుకుదిరా అనే నాటకంలో ఆయన పోషించిన కోచువావా అనే పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది.తండ్రి నాటకాల్లో నటిస్తుండటంతో రాజన్ కూడా వివిధ నాటక రంగ సంస్థల్లో చేరి నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. సీనియర్ నాటకరంగ నిపుణుడైన ఎన్ .ఎన్.పిల్లై సంస్థలో అతను వేసిన పాత్రలు బాగా ప్రాచుర్యం పొందాయి. తర్వాత ఎస్. ఎల్. సదానందన్ రూపొందించిన కట్టుకుదిరా అనే నాటకంలో రాజన్ కోచువావా అనే పాత్ర పోషించి కేరళ అంతటా మంచి పేరు సంపాదించాడు.

Unknown Facts About Villain Rajan P Dev And His Son's-

1984, 86 సంవత్సరాలో కేరళ రాష్ట్రం ఉత్తమ నాటకరంగ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. నాటకాల్లో చురుగ్గా కొనసాగుతుండగానే సినిమాల్లో కూడా నటించడం ప్రారంభించాడు. అందులో చాలా సినిమాలు విజయం సాధించినా నాటకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. జుబిలీ థియేటర్స్ అనే నాటక సంస్థను నెలకొల్పి దాని ద్వారా నాటకాలు వేసేవాడు. తమ కుమారుడి పేరు కూడా అదే జుబిల్ దేవ్…మరొక కుమారుడు ఉన్ని దేవ్ ఇద్దరూ కూడా నటులే..