ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడు చూడలేదు..! ఆ యువతి ఇద్దరికీ ఓకే చెప్పి...చివరికి..?   Unexpected Twist In Triangle Love Story     2018-09-11   11:37:08  IST  Sainath G

ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద తెలుగులో చాలానే సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆర్య సినిమా. సినిమాలో పెద్దగా ట్విస్ట్ ఉండదు…అనుకున్నట్టుగానే హీరోయిన్ చివరకు హీరో ని ప్రేమిస్తుంది. కానీ రైలు ప్రయాణంలో ఆ ఇద్దరు యువకులూ అనూహ్యంగా ఒకే అమ్మాయిని చూసి లవ్ చేసారు. అందులో ఒకరితో ఆమె ప్రేమకు అంగీకరించింది. చెట్టాపట్టాలేసుకొని తిరగడమే కాకుండా పలుమార్లు శారీరకంగానూ కలిశారు. కానీ రెండేళ్ల తర్వాత అతనికి ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది…రెండో యువకుడు ఆమెకు టచ్‌లోకి వచ్చాడు. వారిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. కానీ, మొదటి ప్రియుడు ఆమెను వదులుకోలేకపోయాడు. దీంతో ఆమె తన రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుణ్ని గొంతు కోసి హతమార్చింది. ఈ దుర్ఘటన ఢిల్లీ శివార్లలోని నోయిడాలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళ్తే…రహీమ్, ఇస్రాఫిల్ అనే ఇద్దరు యువకులు నాలుగేళ్ల కిందట కతిహార్ (బిహార్) – ఢిల్లీ ట్రెయిన్‌లో ప్రయాణిస్తున్నారు. వారికి ఎదురు సీట్లో సయరా (22) అనే యువతి కూర్చుంది. ఆ ఇద్దరు యువకులు ఒకరికి తెలియకుండా మరొకరు తొలి చూపులోనే సయరా ప్రేమలో పడ్డారు. సయరా కతిహార్ కంటే ముందే ముజఫర్‌పూర్‌లో దిగిపోగా.. వారిద్దరూ కూడా ఆమె కోసం అక్కడే దిగారు. సయరా ప్రేమ పొందడానికి కొద్ది రోజుల పాటు వారిద్దరూ విడివిడిగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొలుత ఇస్రాఫిల్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వారిద్దరూ శారీరకంగానూ కలిశారు.

Unexpected Twist In Triangle Love Story-

అయితే.. రెండేళ్ల కిందట ఇస్రాఫిల్‌కు మరో యువతితో వివాహమైంది. అయినా.. సయరాను ఇస్రాఫిల్ రహస్యంగా కలిసేవాడు. ఆ తర్వాత ఉన్నట్టుండీ ఒక రోజు ఆమెకు రహీమ్ కలిశాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఆమె ఇస్రాఫిల్‌ను దూరం పెడుతూ వచ్చింది. కానీ, పెళ్లైనా ప్రేయసి మీద మోజు చంపుకోని ఇస్రాఫిల్ తరచూ సయరాకు ఫోన్ చేసి కలుద్దామని వేధించాడు. రహీమ్‌తో ఆమె సాన్నిహిత్యంగా ఉంటున్న విషయం తెలుసుకొని అతడికి తమ రహస్యం చెబుతానంటూ బెదిరించాడు ఇస్రాఫిల్.