'ఈబీ-5' మరింత ఖటినం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచీ అమెరికాలోని ఎన్నారైలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు వలస విధానంపై రోజు రోజు కి ఎంతో ఖటినంగా వ్యవహరిస్తున్నాడు.ఈ తీరుతో ఎన్నారైలు అనేక ఇబ్బందులకి గురవుతున్నా ట్రంప్ తన విధానంలో ఎటువంటి మార్పులు చేయడంలేదు సరికదా ఎన్నారైలకి ఇబ్బందులు కలిగేలా మరిన్ని చర్యలకి పాలపడుతున్నాడు.

 Trump Puts Major Restrictions On Eb 5 Visa-TeluguStop.com

అందులో భాగంగానే హెచ్ 1 బీ పై ట్రంప్ చేపట్టిన చర్యలు అందరికీ తెలిసిందే అయితే తాజాగా ట్రంప్ కన్ను ఈబీ- 5 పై పడింది.

ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తే, గ్రీన్‌కార్డును అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తుంది అయితే ఈ ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠిన తరం చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం అనుకుంటోంది…దీని కనీస పెట్టుబడిని 5మిలియన్‌ డాలర్లకు పెంచనున్నారని అమెరికన్‌ కాంగ్రెస్‌మెన్‌ ఆరోన్‌ స్కాక్‌ చెబుతున్నారు…అయితే వచ్చే ఏడాది జనవరి నుంచీ ఈ నిభందన అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఈబీ-5వీసాలను పొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రతీ ఏటా 30-40 శాతం వృద్ధి నమోదవుతోందని వచ్చే 3-4నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఈ వీసా విధానానికి సంభందించి యూకే 2మిలియన్‌ డాలర్లకు పెంచగా.కెనడా ఒక మిలియన్‌ డాలర్లకు.ఆస్ట్రేలియా 4 మిలియన్‌ డాలర్లకు పెంచిందని తెలిపారు.ఈబీ-5వీసా పొందే జాబితాలో భారత్‌మూడో స్థానంలో ఉంది సర్వేలు వెల్లడించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube