గీత మాధురిపై ట్రోల్స్‌ ఏ స్థాయిలో వస్తున్నాయో తెలుసా..   Trolls On Geetha Madhuri Romance In Big Boss Telugu 2     2018-09-15   11:03:45  IST  Ramesh P

సింగర్‌ గీత మాధురి చాలా పద్దతిగా ఉంటుంది, ఆమె ఇతరులతో ప్రవర్తించే తీరు అందరికి ఆదర్శనీయం, ఆమె డ్రస్సింగ్‌ కూడా చాలా సాంప్రదాయ బద్దంగా ఉంటుంది అనేది గతంలో అందరు అనుకున్న మాటలు. కాని ఇప్పుడు ఆమె ఇమేజ్‌ మొత్తం డ్యామేజీ అయ్యింది. గీత మాధురి బిగ్‌ బాస్‌లో చేస్తున్న పనుల కారణంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గీత మాధురి గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చిన విషయం తెల్సిందే. గీత మాధురి, సామ్రాట్‌ల మద్య వ్యవహారం గురించి తారా స్థాయిలో చర్చలు జరిగాయి. దానికి తోడు తాజాగా నందు వచ్చిన సందర్బంగా జరిగిన చర్చ మరీ ఎక్కువ అయ్యింది.

ఇంటి సభ్యుల్లో ప్రతి ఒక్కరిలో కూడా తన భర్తను చూసుకోవడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి సభ్యుల్లో అమ్మ, నాన్న, అన్న తమ్ముడు వంటి వారిని చూసుకుంటే పర్వాలేదు కాని, భర్తను, బావను చూసుకోవడం ఏంట్రా బాబోయ్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ దారుణంగా వస్తున్నాయి. గీత మాధురి గురించి గతంలో ఉన్న ఇంప్రెషన్‌ అంతా పోయింది. బయట జరుగుతున్న చర్చ గురించి తెలిసిన తర్వాత కూడా గీత ప్రవర్తిస్తున్న తీరు మరింతగా చర్చకు తెర లేపుతుంది.

Trolls On Geetha Madhuri Romance In Big Boss Telugu 2-

సామ్రాట్‌తో తాను వ్యవహరిస్తున్న తీరు వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని గీతకు తెలిసింది. అయినా కూడా గీత అతడితో మరింత క్లోజ్‌గా వ్యవహరిస్తూ వస్తుంది. గీతా మాధురి వల్లన బిగ్‌ బాస్‌ పరువు కూడా పోతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం ఆమెను ఎలిమినేట్‌ చేయాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కౌశల్‌ ను సీజన్‌ మొత్తంకు నామినేట్‌ చేయడం వల్ల ఆమెను కౌశల్‌ ఆర్మీ టార్గెట్‌ చేస్తుంది. దానికి తోడు ఆమె వ్యవహరిస్తున్న తీరు కూడా విమర్శల పాలు అవుతుంది.