ఈ 10 మంది సినీప్రముఖుల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలుసా.? సినిమా ఫీల్డ్ కాకుండా ఏం ఎంచుకున్నారంటే.?

డాక్టర్ కూతురు డాక్టర్,యాక్టర్ కొడుకు యాక్టర్.అమ్మానాన్న ఐఏఎస్ అయితే వారి పిల్లలు కూడా ఏ కలెక్టరో,ఏ పోలీసాఫీసరో ఇది కదా రూలు.

 Top Film Celebrities Daughters And Their Different Fields1-TeluguStop.com

అమ్మానాన్న వృత్తులు లేదా ఉద్యోగాలను బట్టే పిల్లలు కూడా ఎక్కువగా ఆయా రంగాల్నే ఎంచుకుంటుంటారు.ఇది రాజకీయాల్లో,సినిమాల్లో ఇంకెక్కువగా కనపడుతుంది.

సినిమా రంగంలో అయితే తెరమీద కనపడితే ఆ క్రేజే వేరు.కానీ ఆ క్రేజ్ పట్ల ఎటువంటి ఇంట్రస్ట్ లేకుండా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎంచుకున్న సినిమా వారి విశేషాలు మీకోసం.

నారా బ్రాహ్మణి

రాజకీయాలు,సినిమా రంగం రెండు కలగలిసిన కుటుంబం.అందానికి అందం,చదువు బ్రహ్మణి సొంతం.

కానీ అటు సినిమాల్ని,ఇటు రాజకీయాల్ని కాదని వ్యాపార రంగాన్ని ఎంచుకుంది బ్రహ్మణి.హెరీటేజ్ లాభాల బాట వెనుక ,హెరిటేజ్ గ్రూప్స్ ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈమె కృషి ఎంతో ఉంది.

దాంతో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా బాలక్రిష్ణ ముద్దుల కూతురు ,నారా చంద్రబాబు నాయుడు కోడలు అయిన బ్రహ్మణి చూస్తుంది.

మంజుల

సూపర్ స్టార్ క్రిష్ణ కూతురు,ప్రిన్స్ మహేశ్ బాబు సిస్టర్ అయిన మంజుల కెరీర్ యాక్టింగ్ నుండే స్టార్ట్ అయింది.కానీ ఆ తర్వా త ప్రొడక్షన్ రంగం వైపెళ్లింది మంజుల .రెండే పాత్రలతో ప్రయోగాత్మక చిత్రం షో ద్వారా మంజుల వెండితెరకు పరిచయం అయింది.ఆ తర్వాత కావ్యాస్ డైరీలో నటించింది.ఆరెంజ్ లో రాంచరణ్ అక్కగా నటించింది.కావ్యాస్ డైరీ,షో ,నానీ,ఏం మాయ చేసావే,పోకీరి లాంటి సినిమాలను అందించిన ఇందిరా ప్రొడక్షన్ హౌజ్ ఓనర్ మరెవరో కాదు మంజులానే…

సుస్మిత కొణిదెల

మెగా కాంపౌండ్ అంటేనే సగం సినిమా స్టార్లు ఉన్న కుటుంబం.అటువంటి కుటుంబం నుండి నిహారికా మినహా సినిమా తెరపై మెరిసిన అమ్మాయిలు లేరు.సుస్మిత మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు.ఖైదీ నెం.150,మీ లో ఎవరు కోటిశ్వరుడు ప్రొగ్రాంలో తన తండ్రి చిరంజీవికి స్టైలిష్ట్ గా వర్క్ చేసింది సుస్మితనే.

పురందేశ్వరి

ఐదు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగే పురందేశ్వరి తండ్రి ఏర్పరిచిన రెండు బాటల్లో ఒక దాన్ని సినిమారంగాన్ని ఎంచుకోకుండా మరొక రంగం రాజకీయాన్ని ఎంచుకుంది.సదరన్ సుష్మాస్వరాజ్ గా పేరు గాంచిన పురందేశ్వరి జెమాలజీ మీద కోర్స్ చేసి హైదరాబాద్ ఇన్సట్యూట్ జెమ్స్ అండ్ జువెలరీ ని స్థాపించింది.మల్టీటాలెంటెడ్ అయిన పురందేశ్వరి కూచిపూడి నాట్యం కూడా చేయగలదు.

నాగ సుశీల

అక్కినేని ఫ్యామిలి కూడా సినిమా రంగంతో విశేషమైన సంభందం కలిగి ఉన్నదే.అటువంటి ఫ్యామిలి నుండి వచ్చిన నాగసుశీల రియలెస్టేట్ రంగంలో అడుగుపెట్టారు.అంతేకాకుండా సినిమా నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించారు.కరెంట్,కాలిదాసు,అడ్డా లాంటి సినిమాలను తన కొడుకు సుషాంత్ ని హీరో గా పెట్టి ప్రొడ్యూస్ చేశారు.మరోవైపు అన్నపూర్ణ స్టూడియో బాద్యతలు,అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియా డైరెక్టర్ గా ఉన్నారు.

ఉపాసన

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలి నుండి రాకపోయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలిలోకి అడుగుపెట్టారు ఉపాసన.అపోలో చారిటి కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఉపాసన.

స్నేహా రెడ్డి

అల్లు అర్జున్ వైఫ్ స్నేహరెడ్డిది అత్తింటివారు పూర్తిగా సినిమాలకు సంభందించిన వారు.పెళ్లికి ముందే తండ్రి వ్యాపారాలను చూసుకునేది స్నేహ.ఆ తర్వాత వాటితో పాటు ఆన్లైన్ ఫొటో స్టూడియో పికాబూ ని స్టార్ట్ చేసారు.

నికితా రెడ్డి

ఎన్నో హిట్స్ తర్వాత వరుసగా పది వరకు ప్లాపులొచ్చిన హీరో ఎంత నిరాశలో ఉంటాడు.అలాంటి నిరాశలో ఉన్న హీరోనే నితిన్.తర్వాత ఇష్క్ తో మళ్లీ హిట్స్ తో దూసుకుపోతున్నారు.ఇష్క్ ,గుండెజారి గల్లంతయ్యిందే,చిన్నదాన నీకోసం లాంటి హిట్స్ ని నితిన్ కి ఇచ్చి ఆ సినిమాలనుప్రొడ్యూస్ చేసింది మరెవరో కాదు నితిన్ సిస్టర్ నికితా రెడ్డి.

నితిన్,నికితాల తండ్రి కూడా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరే.అఖిల్ డెబ్యూ మూవీ ప్రెసెంట్ చేసింది కూడా నికితానే

రయానే మిథున్

హీరోల కూతుర్లు హీరోయిన్లు కాకపోయినా.హీరోయిన్ల కూతుర్లు మాత్రం ఖచ్చితంగా హీరోయిన్లే అవుతారు.అలా వచ్చినవారు చాలామంది.

కానీ రాధికా కూతురు రయానే మాత్రం చిన్నప్పటి నుండి అమ్మతో సినిమా షూటింగ్స్ ల కుతిరిగినప్పటికీ.ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్నే ఎంచుకుంది.

రాధిక నిర్మాణ సంస్థ రాడాన్ మీడియాకు మీడియా హెడ్ గా వర్క్ చేస్తుంది.ఈమె క్రికెటర్ అభిమన్యు మిథున్ ని లవ్ మ్యారెజ్ చేసుకుంది.

సౌంధర్య,ఐశ్వర్య

రజనీకాంత్ గారాల పట్టీలు సౌంధర్య,ఐశ్వర్య.రజనీకాంత్ కి వారసులు వీరే.ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న నటుడు రజనీ కాంత్ అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ చూజ్ చేసుకున్నారు.సౌందర్య హీరో ధనుష్ వైఫ్.

నిర్మాత గా,కొన్ని ప్రొగ్రామ్స్ కి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.ఐశ్వర్య నిర్మాత ,గ్రాఫిక్ డిజైనర్,డైరెక్టర్.

తన తండ్రితో కొచాడియన్ అనే సినిమాతో దర్శకురాలిగా కూడా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube