ఒక ప్రియుడు.. ముగ్గురు ప్రేయసిలు.! మోసం చేసినందుకు ముగ్గురు కలిసి అతన్ని కొడతారనుకుంటే సీన్ రివర్స్.!   Three Girls Fight For One Boyfriend In Public Place     2018-09-14   11:30:51  IST  Sainath G

ఒక్క ప్రియుడు.. ముగ్గురు ప్రేయసిలు..వీరి ప్రేమ చివరకు సీన్ సితారైంది.. ఓ రోమాంటిక్ కుర్రాడు.. ఒకరికి తెలియకుండా ఒకరికి మాయ మాటలు చెప్పి ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాడు. ఓ రోజు అతని బండారం బయటపడింది. ఇంకేముంది ముగ్గురమ్మాయిలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అంతా భావించారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ఈ ప్రియుడు నాకు కావాలంటే నాకు కావాలంటూ ప్రియురాళ్లు జుట్టుపట్టుకొని కొట్టుకోసాగారు. మధ్యలో ప్రియుడు ఎంత ఆపుదామని ట్రై చేసినా సాధ్యం కాలేదు. ముగ్గురు ప్రియురాళ్లు కొట్టుకుంటున్న ఈ ప్రేమ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమాల ప్ర‌భావంమో..సొష‌ల్ మీడియా నిర్వాక‌మొ తెలియ‌దు కానీ రాను రాను యువ‌త ఆలోచ‌నా విధానాలు తీవ్ర‌రూపం దాల్చుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఇందుకు ఉదాహ‌ర‌న‌గా నిలిచింది. కర్ణాటకలోని హుబ్లీలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న పై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో హుబ్లీ లవర్స్ స్ట్రీట్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాలలోకి వెళ్తే..హుబ్లీలోని ఓ కాలేజీ చదువుతున్న కుర్రాడు.. తన క్లాసులోని ముగ్గురు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించాడు. ముగ్గురిని ప్రేమిస్తూ.. ప్రేమించబడుతూ ఒకరికి తెలియకుండా ఒకరితో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

watch video:

కానీ ఓ శుభ ఉదయాన ఈ ప్రేమికుడి ప్రేమ వ్యవహారానికి ఊహించని ఎండ్ కార్డ్ పడింది. ఒకరికి తెలియకుండా ఒకరిని కలిసేందుకు వచ్చిన ఈ కుర్రాడికి ముగ్గురు ఒకేసారి కలువడంతో ఖంగుతిన్నాడు. అయితే ముగ్గురూ కలిసి అతడికి బడితె పూజ చేస్తారని భయపడ్డాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆ ముగ్గురు అమ్మాయిలు ఈ ప్రియుడు తమ వాడేనంటూ నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. నాకు కావాలంటూ నాకు అంటూ కొట్టుకుంటున్న ప్రియురాళ్లను సముదాయించేందుకు ఈ ప్రియుడు నానా తంటాలు పడ్డాడు.