నగ్నంగా పెళ్లికూతురు ఫోటో..! చిక్కుల్లో పడ్డ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్.! చంపేస్తామని బెదిరింపులు!     2018-08-26   13:37:07  IST  Sai Mallula

అతిసర్వత్రా వర్జయేత్ అని ఊర్కేనే అనలేదు అనుకుంట. అంతేకదా అండి ఎందులో అయినా అతి చేస్తే మనకే ముప్పు. అలా అతి క్రియేటివిటీ ప్రదర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ ను ఇప్పుడు కొంతమంది చంపేస్తామని బెదిరిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ప్రీతమ్‌ మిత్రా అనే ఓ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌. మోడల్‌కు పెద్ద బొట్టు పెట్టి బెంగాళీ పెళ్లి కూతురులా ముస్తాబు చేశాడు. అయితే, ఆమె శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటో తీసి.. తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారడంతో బెంగాళీలు ఆ ఫొటోగ్రాఫర్‌పై మండిపడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు.

Threats For Bridal Photographer Who Shot In The Cloth Less-

Threats For Bridal Photographer Who Shot In The Cloth Less

ఇటీవల ఓ మోడల్‌తో ఫొటోషూట్‌ నిర్వహించాడు. అయితే అది సాధారణ ఫొటోషూట్‌ అయితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ మోడల్‌ను పెళ్లికూతురుగా, బెంగాల్‌ స్టైల్‌లో పెద్ద బొట్టుతో అలంకరించి న్యూడ్‌ ఫొటోలు తీశాడు. ఆ మోడల్‌ ఎవరో తెలియకుండా కళ్లు మాత్రమే కనిపించేలా తమలపాకులతో జాగ్రత్తపడ్డాడు. అలాగే ఆమె ప్రయివేట్‌ పార్ట్స్‌ కనిపించకుండా జుట్టుతో, చేతిలో కుంకుమ భరణి పెట్టి కవర్‌ చేశాడు.

Threats For Bridal Photographer Who Shot In The Cloth Less-

అయితే, బెంగాళీ నెటిజన్లు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బెంగాలీ వివాహ వ్యవస్థ, హిందువులను అవమానించేలా ఆ ఫొటో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు.. 24 గంటల్లో ఫొటో తొలగించకపోతే చంపేస్తామని పీత్రమ్‌ను హెచ్చరించారు. దీనిపై ప్రీతమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫొటో వల్ల ప్రీతమ్ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.