మంత్రి అఖిల ప్రియ పదవి పీకేస్తున్నారా ..?     2018-08-12   10:21:56  IST  Sai Mallula

మరి కొద్ది రోజుల్లో ఏపీ క్యాబినెట్ విస్తరణ జరగబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో… ఇప్పుడు రకరకాల వార్తలు బయటకి వస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరగబోతున్న ఈ క్యాబినెట్ విస్తరణలో చేర్పులే కాదు తీసివేతలు కూడా ఉన్నట్టు సమాచారం. గత కొంత కాలంగా ఏపీ మంత్రి మండలిలో ఆ మంత్రి వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. కీలకమైన క్యాబినెట్ మీటింగ్ లకు సైతం హాజరు కాకుండా ఎగనామం పెడుతూ బాబు కి తలనొప్పిగా మారింది.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి అఖిల ప్రియ వ్యవహారం చాలా కాలంగా సీఎం చంద్రబాబు కు నచ్చడంలేదు. ఈ నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రిగా కూడా అఖిలప్రియ పనితీరు ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖిలను తప్పించినా అడిగే వారు ఉండరనే లెక్కల్లో చంద్రబాబుకు ఉన్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశాలకు హాజరుకాకపోవడమే కాకుండా సొంత శాఖ మీద పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టకుండా కేవలం తన వ్యక్తిగత విషయాలమీద మీద దృష్టిపెట్టడం అనేక విమర్శలకు తావిస్తోంది.

Threat To Akhila Priya Minister Post-

Threat To Akhila Priya Minister Post

నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల విషయంలో బాబు లెక్కల కోణం నుంచి చూసినా.. అఖిలప్రియకు ప్రాధాన్యత చాలా వరకూ తగ్గబోతోంది. ఒక వేళ కేబినేట్ నుంచి తొలగిస్తే అఖిల భవిష్యత్తు గందరగోళం లో పడినట్టే. ఎందుకంటే ఆమె ప్రస్తుతం వైసీపీ లో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె జగన్ నివాసానికి వెళ్లి మరీ చర్చలు జరిపినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఆ చర్చల సారాంశం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఒక వేళ ఆమెకు వైసీపీ నుంచి రెడ్ సిగ్నల్ గనుక పడితే జనసేన తప్ప మరో ప్రత్యామ్న్యాయం కనిపించడంలేదు.