సెక్యురిటీ గార్డుకి సెల్యూట్ చేసిన క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్...ఇంతకీ ఆ సెక్యురిటీ గార్డు చేసిన పనేంటో తెలుస్తే మీరు కూడా రియల్ హీరో అంటారు.     2018-08-25   13:17:45  IST  Rajakumari K

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు.. ఆ సాయం పెద్దదా చిన్నాదా కాదు..అసలు సాయం చేయాలనే ఆలోచన రావడమే గొప్ప..అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడో సెక్యురిటీ గార్డు.ఒకవైపు తన వుద్యోగం మరోవైపు ఉద్యోగంతో పాటు నిరుపేద విద్యార్దులకు అక్షరజ్ణానం ప్రసాదిస్తున్నాడు..అతడు చేస్తున్న పని ఇటీవల మన క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కంటపడింది..అంతే ట్విటర్లో ట్వీట్ చేశాడు..లక్ష్మణ్ ట్వీట్ చూసిన నెటిజన్లు రియల్ హీరో అంటూ ఆ సెక్యురిటీ గార్డుని ప్రశంసిస్తున్నారు.

This Retired Army Man Works As A Security Guard And Teacher-

This Retired Army Man Works As A Security Guard And As A Teacher

డెహ్రాడూన్‌కు చెందిన బ్రిజేంద్ర గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. తర్వాత ఓ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజూ సాయంత్ర తన విధులు నిర్వహిస్తూనే.. చుట్టు పక్కల మురికివాడల్లో ఉండే పిల్లలకు చదువు చెబుతున్నాడు.ఏటీఎం దగ్గర ఉండే లైట్ల వెలుగులోనే విద్యా బుద్ధులు నేర్పుతున్నాడు. రోజూ ఓ ఐదారుగురు పిల్లలు అక్కడికి వస్తున్నారు. ఆర్మీ నుంచి తాను రిటైర్ అయినా జాతిపై ప్రేమ ఏ మాత్రం దాచుకోవట్లేదు.ఇదే విషయాన్ని వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు..2016 నుండి బిజేంద్ర పిల్లలకు విద్యాబుద్దులు నేర్పుతున్నారు..లక్ష్మణ్ ట్వీట్ ద్వారా ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు.

This Retired Army Man Works As A Security Guard And Teacher-

ఆర్మీ నుంచి రిటైర్ అయినా ఇప్పటికీ దేశం కోసం తన సేవలు అందజేస్తున్నాడు. మురికివాడల్లో పిల్లలకు ఏటీఎం లైట్ల కిందే రోజూ రాత్రి వరకు చదువు చెబుతున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తికి సెల్యూట్ అన్నాడు. లక్ష్మణ్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా స్పందించారు. బ్రిజేంద్ర చేస్తున్న పనిని కొనియాడుతున్నారు. అతని గొప్పదనాన్ని పొగిడేందుకు మాటల్లేవ్… గొప్ప పని చేస్తున్నారు.