ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బిగ్‌బాస్‌ 2 వల్ల చాలా లాభపడ్డారు   These Two Beauties Were Gained Good Luck From Bigg Boss Telugu 2     2018-09-25   10:47:39  IST  Ramesh P

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 చివరి వారంకు చేరుకుంది. మరో అయిదు రోజుల్లో సీజన్‌ 2 విజేత ఎవరు అనే విషయం తేలిపోనుంది. ఇక విజేత విషయం పక్కన పెడితే ఈ సీజన్‌ ఎంతో మందికి గుర్తింపును తెచ్చి పెట్టింది. అంతకు ముందు సెలబ్రెటీలు అయినప్పటికి కొందరికి గుర్తింపు లేదు. కాని బిగ్‌ బాస్‌లోకి ఎంటర్‌ అయిన తర్వాత అనూహ్యంగా వారి స్థాయి పెరిగి పోయింది. స్టార్‌ డం దక్కించుకున్న సదరు సెలబ్రెటీలు బిజీ అవుతున్నారు. బిగ్‌ బాస్‌ రెండవ సీజన్‌లో పాల్గొన్న భాను శ్రీ మరియు తేజస్విలు చాలా లాభపడ్డట్లుగా అనిపిస్తుంది.

బిగ్‌ బాస్‌కు ముందు భాను శ్రీ గురించి ఏ ఒక్కరికి సరిగా తెలియదు. కొన్ని సీరియల్స్‌లో నటించిన ఆమె, కొన్ని స్టేజ్‌ షోల్లో కనిపించింది. కాని బిగ్‌ బాస్‌ తర్వాత భాను శ్రీ స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈ అమ్మడు ఎప్పుడైతే బిగ్‌ బాస్‌లో కనిపించిందో అప్పుడే స్టార్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌లో ఈమె ప్రవర్తన, బాడీలాంగ్వేజ్‌ అంతా కూడా భానుశ్రీను అభిమానించేలా చేసింది. దాంతో ఆమెకు యాంకర్‌గా ఛాన్స్‌ దక్కింది. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ కొత్త సీజన్‌కు భాను శ్రీ యాంకర్‌గా వ్యవహరిస్తుంది.

ఇక తేజస్వికి బిగ్‌ బాస్‌కు ముందు నుండి మంచి గుర్తింపు ఉంది. కాని ఈమద్య కాలంలో ఆమెకు అటు వెండి తెరపై, ఇటు బుల్లి తెరపై అవకాశాలు కనుమరుగు అయ్యాయి. దాంతో ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పాల్గొంది. దాంతో మళ్లీ తేజస్వికి గుర్తింపు దక్కింది. ఫైనల్‌ వరకు తేజస్వి ఉంటుందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా తేజస్వి మద్యలోనే ఎలిమినేట్‌ అయ్యింది.

These Two Beauties Were Gained Good Luck From Bigg Boss Telugu 2-

బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన తేజస్వికి బుల్లి తెరపై యాంకర్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న లాఫ్టర్‌ ఛాలెంజ్‌ షో పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఆ షోకు యాంకర్‌గా తేజస్వి ఎంపిక అయినట్లుగా సమాచారం అందుతుంది. బిగ్‌బాస్‌ పూర్తి అయిన తర్వాత ఈ కామెడీ షో ప్రారంభం కాబోతుంది.