కుల పిచ్చి ఉన్న వారికి నా 10 ప్రశ్నలు ఇవే..! నేను అడిగిన దాంట్లో తప్పు ఏమైనా ఉందా.?   These 10 Questions For Who Was Hates Inter Caste Marriages     2018-09-17   12:31:14  IST  Sainath G

గే సెక్స్ లో తప్పు లేదు అని సెక్షన్ 377 ను కొట్టేసింది సుప్రీమ్ కోర్ట్… కానీ కులాంతర వివాహం చేసుకుంటే మాత్రం పరువు నష్టం అనుకుంటున్నారు ఇప్పటికి కొంతమంది పెద్దలు.

చట్టాలు ముందగుడు వేస్తున్నాయి…కానీ కొందరు మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోయి వెనకడుగు వేస్తున్నారు. కావాల్సింది చట్టాల్లో మార్పు కాదు…మనుషుల్లో మార్పు…సాటి మనిషిని మనిషిగా గుర్తించాల్సిన మార్పు…కూతురు కులాంతర వివాహం చేసుకుంది అని అల్లుడ్ని చంపేసి కూతురి నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసాడు ఓ దయాగుణం లేని తండ్రి. కూతురుకి పుట్టబోయే పాసిబిడ్డకు తండ్రిని దూరం చేసాడు. చివరికి ఏం సాధించాడు. ఏ పరువు కోసం అయితే చేసాడో అంతకంటే ఎక్కువ పరువే పోయింది..చివరికి జైలులో జీవితం గడపాల్సి వస్తుంది.

కుల పిచ్చి ఉన్న వారికి నా ప్రశ్నలు ఇవే.:

నీ కడుపు నింపే రైతుది నీ కులం కాదు…ఎలా తింటున్నావు.?
నీ ఇంట్లో పాల ప్యాకెట్ వేసేవారిది నీ కులం కాదు…ఎలా కొంటున్నావు?
నీకు చదువు చెప్పిన గురువు ది నీ కులం కాదు..ఎలా చదువుకున్నావు?
నీ ఇల్లు కట్టిన కూలిది నీ కులం కాదు…ఇంట్లో ఎలా ఉంటున్నావు?
నీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే వారిది నీ కులం కాదు…ఎలా వేసుకుంటున్నావు?

నీ ఇల్లు ఊడ్చే పనిమనిషిది మీ కులమా?
రోగం వస్తే నువ్వు వెళ్లే డాక్టర్ ది మీ కులమా?
జుట్టు పెరుగుతే నువ్వు వెళ్లే కటింగ్ షాప్ వారిది నీ కులమా?

కులం పేరుతొ మనుషులను విడదీసి ఏం సాధించావ్?
ఏ పరువు కోసమైతో చేసావో ఆ పరువు పోగొట్టుకున్నావు…కూతురు జీవితాన్ని నాశనం చేసావు.!

These 10 Questions For Who Was Hates Inter Caste Marriages-

సాటి వారికి సాయం చేయలేనప్పుడు నువ్వెందుకు నీ కులం ఎందుకు.?
కులం అంటే మనం చేసే పని…ఎవరు చేసే పనిని బట్టి వారి కులం వచ్చింది..ఒకరు ఎక్కువ కులం..ఒకరు తక్కువ కులం అనే మాట ఏంటి.? అందరు కష్టపడే పని చేస్తున్నారు…అందరు ఒక్కటే.!

#చివరగా కులం కన్నా గుణం గొప్పది…కులం గొప్పదైతే మహా అయితే నీ కులపోల్లు నీ దగ్గరికి వస్తారు..కానీ నీ గుణం మంచిదైతేనే నీతో కలిసి జీవితంలో ప్రయాణిస్తారు..!
#మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోండి.!