ఆఫరేషన్ చేస్తున్నంతసేపు మత్తులోకి వెళ్లొద్దని డాక్టర్లు చెప్పడంతో..ఆ యువతి ఏం చేసిందో తెలుసా..హాస్పటల్ సిబ్బంది ఫిదా అయిపోతున్నరు.     2018-08-29   12:34:46  IST  Rajakumari K

బ్రెయిన్ ట్యూమర్ పేరు వింటేనే బెంబేలెత్తిపోతాం…ఇక బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తి సంగతి చెప్పక్కర్లేదు మానసికంగా కృంగిపోతాడు.. సర్జరీ చేసి ట్యూమర్ తొలగించాలంటే తెలియని కలవరం వెంటాడుతుంటుంది..ఏదైనా చిన్న ఆపరేషన్ అంటేనే కొందరు హడలిపోయి,ఆఫరేషన్ చేసే టైంలో పడే టెన్షన్‌ను మాటల్లో వర్ణించలేం…కానీ ఓ మహిళ మాత్రం సర్జరీ చేస్తున్నంత సేపు సరదాగా జోకులేసి నవ్వించింది.మహిళని మెలకువతో ఉంచాలనుకున్నారు డాక్టర్లు,కాని వారి అంచనాలకు అందకుండా ఆ మహిళ చలాకీగా ఉండడం చూసి డాక్లర్లే షాక్ తిన్నారు..

Brain Tumor  The Young Sarah Got Operation Of -

Brain Tumor, The Young Sarah Got Operation Of Brain Tumor, Sarah,

సారా అనే యువతి ఏడాది క్రితం మూర్ఛ వచ్చి కింద పడిపోయింది .హాస్పటల్లో అడ్మిట్ చేస్తే ట్యూమర్ కారణంగానే పడిపోయిందని,పరీక్షలో తేలిన విషయాన్ని మెలకువ వచ్చాక ఆమెకు చెప్పారు.ఆ విషయం వినగానే ఆమె కంగారు పడుతుందని డాక్టర్లు అనుకున్నారు. కానీ సారా మాత్రం కంగారు పడలేదు, ధైర్యం కోల్పోలేదు.అంతేకాదు ట్యూమర్‌కి రోడ్జర్ అనే పేరు కూడా పెట్టేసింది..వృత్తిరీత్యా టీచర్, కమెడియన్ అయిన సారా కి ఇటీవల 9 గంటలపాటు సుదీర్ఘంగా బ్రెయిన్ సర్జరీ చేసి ట్యూమర్ తొలగించారు.

Brain Tumor  The Young Sarah Got Operation Of -

సర్జరీ జరుగుతున్నంత సేపు పేషెంట్ మత్తులోకి వెళ్లకూడదు. ఇదే విషయాన్ని డాక్టర్లు ఆమెతో చెప్పారు. దీంతో ఆమె సరదాగా జోకులేస్తూ డాక్టర్లను, స్టాఫ్‌ను నవ్వించింది. స్పీచ్ థెరపిస్ట్ సూచన మేరకు ఆమె పాటలు కూడా పాడింది. కేఫ్‌లో సరదాగా ఫ్రెండ్స్‌తో గడిపినట్టు ఆమె ఆపరేషన్ థియేటర్లో గంటల సమయాన్ని గడిపేసింది.సర్జరీ పూర్తయ్యాక కోలుకున్న ఆమె యథావిథిగా స్కూలుకెళ్తోంది. ఈ మధ్యే ఆమె ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యింది, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది.ఆమె ధైర్యాన్ని చూసి అటు హాస్పటల్ సిబ్బంది ,ఇటు తన కుటుంబం ఫిదా అయిపోతున్నరు.