కౌశల్‌ ఆర్మీని ఎవరో డబ్బులు ఇచ్చి మరీ నడుపుతున్నారు.. వీడియో సాక్ష్యం

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 లో నాని కంటే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి కౌశల్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కౌశల్‌ ఆర్మీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌లో హల్‌ చల్‌ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 The Video Revealed That Kaushal Army Is A Paid Army11-TeluguStop.com

సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ ఒక ట్రెండ్‌ ను సెట్‌ చేస్తున్నారు.కౌశల్‌ ఎప్పుడు ఎలిమినేషన్స్‌లో ఉన్నా కూడా భారీ ఎత్తున ఓట్లు వేస్తూ ఆయన్ను గట్టేకిస్తున్నారు.తాజాగా కౌశల్‌ ఆర్మీ హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడల్లో భారీ ఎత్తున 2కే రన్‌ నిర్వహించిన విషయం తెల్సిందే.2కే రన్‌తో కౌశల్‌ ఆర్మీ స్థాయి ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది.


కౌశల్‌ ఆర్మీని మొదటి నుండి కూడా కొందరు పెయిడ్‌ ఆర్మీ అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.పెయిడ్‌ ఆర్మీకి మరీ ఇంత పబ్లిసిటీ అవసరం లేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలోనే కౌశల్‌ ఆర్మీ కూడా ధీటుగా వారికి సమాధానం ఇస్తున్నారు.కౌశల్‌ ఆర్మీ పెయిడ్‌ ఆర్మీ కాదని, అలాంటి అవసరం ఎవరికి లేదని, అసలు డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ఆర్మీని రన్‌ చేయాల్సిన అవసరం లేదని, కౌశల్‌ ఈ ఆర్మీని ఎవరితోనూ రన్‌ చేయించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.విజయవాడలో కౌశల్‌ ఆర్మీ 2కే రన్‌ నిర్వహించడం జరిగింది.ఆ రన్‌లో పాల్గొన్న ఒక వ్యక్తి రహస్య కెమెరా ఉన్నది గమనించకుండా 2కే రన్‌ నిర్వాహకులు తనకు 400 రూపాయలు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు.పెట్రోల్‌ ఖర్చుల కోసం ప్రతి ఒక్కరికి కూడా పెట్రోల్‌ ఖర్చులు ఇచ్చారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న కౌశల్‌ ఆర్మీ పెయిడ్‌ ఆర్మీ అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.ఎవరో డబ్బులు ఇచ్చి మరీ ఈ ఆర్మీని ఇంతగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు.కౌశల్‌ ఆర్మీని టార్గెట్‌ చేసిన ఎవరో కావాలని ఈ వీడియోను పోస్ట్‌ చేశారని, కొందరు కౌశల్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube