పెళ్లైన స్త్రీలు కాలికి మెట్టెలు ధరిస్తారు..దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఇదే..   The UnKnown Facts Of Toe Ring In Indian Marriages     2018-09-18   13:04:29  IST  Rajakumari K

సంస్కృతి ,సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటాం..కానీ మన ప్రతి సాంప్రదాయ పద్దతి వెనుక ఏదో ఒక శాస్త్రీయత మిలితమై ఉంటుంది..సాధారణంగా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలు కాళ్లకు మెట్టలు ధరిస్తారు. పెళ్లైన స్త్రీలను గుర్తుపట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది..కానీ ఇది కేవలం ఆమెకు పెళ్లి అయ్యిందని సూచించడమే కాదు. దాని వెనుక ఒక ప్రత్యేకత ఉంది .

సాధారణంగా పెళ్లైన స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది. ఇది రక్తప్రసరణను నియంత్రించి రుతుచక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు.

The UnKnown Facts Of Toe Ring In Indian Marriages-

కేవలం మెట్టెల్లోనే కాదు.. నుదుటి పై ధరించే బొట్టుకు, శ్రీమంతం చేసేప్పుడు చేతికే తొడిగే గాజుల వలన కూడా చాలా ఉపయోగాలున్నాయి.. మన పెద్దవాళ్లు ఏం చేసినా,ఏం చెప్పినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది..ఈ కాలం వారు మాత్రమే అవన్ని చాదస్తాలు అంటూ కొట్టిపారేస్తారు. అందుకే పెద్దలు ఏదన్నా చెప్పినా వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకుండా ఎందుకు చేయాలి,దాని వలన ఉపయోగం ఏంటి ఆలోచిస్తే అర్ధం అవుతుంది…