అమ్మో అలా జరిగితే..? వైసీపీలో ఇదో టెన్షన్ !   The Tension Started In YSRCP Party For Elections 2019     2018-09-21   11:19:07  IST  Sai M

ఏపీలో అనేక వడిదుడుకులు ఎదుర్కుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇప్పటివరకు తెలంగాణ లో పార్టీ ఉనికి ఉందా అనే ఆలోచనలో ఉండగానే… తెలంగాణాలో ఎన్నికల జాతర మొదలయిపోయింది. ఇక ఇప్పుడు తన ప్రత్యర్థి టీడీపీ తెలంగాణాలో పోటీ చేసేందుకు సిద్ధం అయిపొయింది. కాబట్టి తమ పార్టీ పోటీచేస్తుందా .. ఎవరికి మద్దతు ఇస్తారు..? పోటీ చేసేందుకు సిద్ధంగా లేదా అనే ఏదో ఒక విషయం పై స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

త్వేలంగాణలో పోటీ చేయడం వల్ల వైసీపీ కి కలిసి వస్తుందా ..? అసలు గెలుపు అవకాశాలు ఎంత ? ఓడిపోతే భవిష్యత్ ఏంటి ? ఇలా అనేక రకాలుగా వైఎస్ఆర్ సీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీయాలనో, టీఆర్ఎస్ ను గెలిపించాలనో తాము బరిలో దిగితే కచ్చితంగా, వైఎస్ జగన్ అక్కడ ప్రచారం చేయాల్సిందే. కానీ అక్కడ ఎంతమంది గెలుస్తారు అనేది పెద్ద సందేహమే.

The Tension Started In YSRCP Party For Elections 2019-

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ వైఎస్ఆర్ సీపీ కంటే టీడీపీయే ఆధిక్యంలో ఉంది. బలంగా ఉంది, ప్రజల ఆశీస్సులు, ఓట్లు తమకే అని చాటి చెప్పారు టీడీపీ నేతలు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయితే తమ పరిస్థితి ఏంటి ? అని ఏపీ వైఎస్ఆర్ సీపీ నేతలు భయపడుతున్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం, కాంగ్రెస్ ఓటమి కోసం తాము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే, దారుణమైన ఫలితాలు వస్తే, ఆ ప్రభావం ఏపీలో పడుతుంది టీడీపీ ఆధిక్యత పెరుగుతుంది. అందుకే.. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం దేనికి అన్న సందిగాధంలో వైసీపీ నేతలు ఉన్నారు. ముందు ఏపీలో పార్టీ పరపతి పెంచుకుని మరింత బలపడితే బెటర్ కానీ గొప్పలకు పోయి తెలంగాణాలో పార్టీ పోటీ పై దృష్టిపెడితే రెండు రాష్ట్రాల్లోనూ దెబ్బతినడం ఖాయం అనే లెక్కలో వైసీపీ అధినేత ఉన్నట్టు సమాచారం.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.