ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత,సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..   The Teachers Day Special Sarvepalli Radhakrishnan Jayanti     2018-09-05   12:43:41  IST  Rajakumari K

గురులో ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది.. అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించేవాడు లేదా చీకటిని తొలగించేవాడు గురు లేదా గురువు అని అర్థం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున అంటే సెప్టెంబర్ 5వ తేదీన మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటారు..సర్వేపల్లి రాధక్రిష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

· భారతరత్న, తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888లో తిరుత్తనిలో జన్మించారు. 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది.

· సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.మొత్తం 27సార్లు నామినేట్ అయ్యారు.

· ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

· గురువులకు ప్రతీక వీరు సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి. ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు.

· సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. 1962 నుంచి 1967 వరకు రెండో రాష్ట్రపతి.

· అతను గొప్ప ఫిలాసపర్, విద్యావేత్త, మానవతావాది.

The Teachers Day Special Sarvepalli Radhakrishnan Jayanti-

· రాధాకృష్ణన్ తన 16వ ఏట శివకామును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు పేరు సర్వేపల్లి గోపాల్.

· లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌లో స్థానం కల్పించారు.

· 1953 నుంచి 1952 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్‌గా పని చేశారు. ఘనశ్యామ్ దాస్ బిర్లా తదితరులతో కలిసి రాధాకృష్ణన్ కృష్ణార్పన్ చారిటీ ట్రస్ట్‌ను స్థాపించారు.

· రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు.