భర్త ఫోటో మార్చి పేపర్లో వేసారు..కుటుంబంలో చిచ్చుపెట్టారు.. ఇంతకీ ఆ ఫోటో పేపర్ వాళ్లకి ఎలా వచ్చింది..     2018-08-20   16:09:59  IST  Rajakumari K

తన అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తన భర్తగా వేరొకరిని చూపడాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన మహిళ పద్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.ఈ ప్రకటనలో ఒక కుటుంబం ఫోటోని ప్రచురించింది.ఆ ప్రకటనల్లో కొన్ని పత్రికలు భర్తగా ఒకరిని, మరికొన్ని ప్రకటనల్లో ఇంకొకరిని చూపించారు.ఇప్పుడు తన భర్త ఫొటోను మార్చడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఆ మహిళ.ఇంతకీ ఆమె ఎవరు..వారి ఫోటో పత్రికల వారకి ఎలా వచ్చింది..

The Rythu Bhima And Kanti Velugu Programme Wrong Ad-

The Rythu Bhima And Kanti Velugu Programme Wrong Ad

సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలానికి చెందిన తొగర్రాయి గ్రామంకి చెందినది ఆ కుటుంబం..మహిళ పేరు పద్మ, ఆమె భర్త పేరు నాగరాజు.ప్రస్తుతం యాదగిరిగుట్ట సమీపంలోని వంగవల్లిలో నివాసం ఉంటున్నారు.. మూడేళ్ల క్రితం తమ గ్రామానికి వచ్చిన కొంతమంది లోన్ల పేరుతో ఫొటోలు తీసుకున్నారని,అవి పేపర్లకు ఎలా వచ్చాయో తెలీదని చెప్తున్న ఆమె..భర్త ఫోటో మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది..ఆమె మాటల్లోనే..

మేమే పాత చీరలు, బొంతలు కుట్టుకుంటామని, ఒకరోజు, ఐదుగురో, పదిమందో వచ్చారు, గొడుగులు అవి తీసుకు వచ్చారు, మీకు లోన్లు ఇస్తామని చెప్పారు, ఆ తర్వాత సంతకం పెట్టించుకున్నారో లేదో గుర్తుకు లేదు, తమకు మాత్రం లోన్లు ఇస్తామని చెప్పారు, తమ పాపకు స్నానం చేయిస్తుంటే ఫోటో తీసుకొని పోయారు. ఆ తర్వాత మాకు ఏ విషయం తెలియదు.ఆ తర్వాత బస్సుల్లో, బడులలో చూస్తే మా ఫోటోలు కనిపించాయి. అప్పుడు అడిగేవారు ఎవరూ లేక, మాకు తెలియక దానిని పట్టించుకోలేదు. భువనగిరిలోను ఫోటోలు పెట్టారు,వాటి గురించి మాకు తెలియదు. ఆ తర్వాత పేపర్లో వచ్చిందని (యాడ్) చెప్పారు. ఆ ఫోటోలు మావే అనుకున్నామని, అయితే నా పక్కన మా ఆయన ఫోటో లేదు ,ఎవరి ఫోటోనో పెడితే ఎలా అని బాదపడుతుంది ఆ మహిళ..

The Rythu Bhima And Kanti Velugu Programme Wrong Ad-

కూలి నాలి చేసుకుని బతికే తమను ఇలా బజారుపాలు చేసి మా సంసారంలో నిప్పులు పోస్తారా అని నిలదీస్తున్న ఆమె.. పత్రికలో యాడ్ వచ్చిన నాటి నుంచి తమ ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఆమె బాధపడుతూ చెప్పారు.ఏదైతేనేమి ప్రభుత్వమో,పత్రికలు వారు చేసిన ఒక తప్పుకి ఒక కుటుంబం అభాసుపాలైంది…