ఆ వీడియోకే ఎక్కువ హిట్స్‌…అదే అమృత తండిరని ఉసిగొల్పింది..! చూస్తే కన్నీరొస్తాయి.!   The Reason Behind Hate On Pranay About Amrutha Father     2018-09-17   12:45:10  IST  Sainath G

అమృత వర్షిణిని, ప్ర‌ణ‌య్..ప్ర‌స్తుతం తెలుగు ప్ర‌జ‌ల్ని అవేద‌న‌కు గురిచేస్తున్న ప్ర‌మేజంట‌.. అరు మాస‌ల క్రితం పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని త‌మ బ్ర‌తుకు తాము బ్ర‌తుకుతున్న‌..ప్రేమ ప‌క్షులు. త‌మ అనురాగానికి ప్ర‌తిఫ‌లంగా త్వ‌ర‌లొనే త‌మ ఇంట మ‌రో మ‌నిషిరాబోతున్నాడ‌ని సంబుర‌ప‌డేలోపే..విధి వారితో అడుకుంది. అమాయి తండ్రే కాల‌య‌ముడ‌య్యి..క‌క్ష‌క‌ట్టి వారిని విడ‌దీసాడు. ప్ర‌ణ‌య్ ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చాడు.

అయితే ప్ర‌ణ‌య్ అమ్రుత వ‌ర్షిని ప్రేమ సాక్షాలు ఇప్పుడు సొష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. వారి అన్యోన్య‌త అంద‌రినీ క‌దిలిస్తోంది. కంట‌నీరు తెప్పిస్తోంది. ఆ విడియోలు మీరూ చూడండి…

ఫేస్‌బుక్‌లో అమృత పోస్ట్‌ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్‌ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత అమృత ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన ఆమె తండ్రి మారుతీరావు నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్‌ వస్తాయంటూ అమృతను హెచ్చరించాడని ఆమె ఆరోపించారు.

The Reason Behind Hate On Pranay About Amrutha Father-

మొదట తాము కూడా పెళ్లికి నిరాకరించామని, అయితే ప్రణయ్‌ లేకపోతే చచ్చిపోతానని అమృత స్పష్టం చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్‌ కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే అమృత తల్లికాబోతోందని తెలిసి ఆగస్ట్ 17న రిసెప్షన్‌ నిర్వహించినట్టు తెలిపారు. తాము భయపడినట్టుగానే ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడితో కిరాయి హంతకులతో ఈ పని చేయించారని ఆరోపించారు. అగ్రకుల అహంకారంతో పథకం ప్రకారం నమ్మించి, గొంతుకోసారని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడుతున్నాయి