టికెట్ బుక్ చేసి దొరికిపోయిన ఫోన్ దొంగ  

ఫోన్ కొట్టేసినవాడు ఎంచక్కా ఆ కొట్టేసిన ఫోన్లో సినిమాలు చూస్కుంటూ,పాటలు వింటూ,వాడికి నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఆనందంలో ఉన్నాడు..ఫోన్ పోగొట్టుకున్న అమ్మాయి కూడా వాడికంటే రిలాక్స్ గా వాడెక్కడున్నాడు,ఆ ఫోన్ తో ఏం చేస్తున్నాడు అంటూ గమనిస్తూ ఆఖరికి పోగొట్టుకున్న ఫోన్ ని సొంతం చేసుకుంది.టెక్నాలజిని ఉపయోగించి దొంగను పట్టుకుంది,పాపం ఆ టెక్నాలజి తెలియక దొరికిపోయాడా దొంగ..

The Mobile Thief Catched By My Activity In Andheri-

The Mobile Thief Catched By My Activity In Andheri

అంధేరీకి చెందిన జీనత్ బాను హక్ అనే 19 ఏళ్ల యువతి ఒకరోజు ఉదయం ట్రెయిన్‌లో ప్రయాణిస్తుంది.ఇంతలో ఆమె జియోమీ 4ఏ స్మార్ట్ ఫోన్ చోరీకి గురైంది.ఫోన్ పోయిన విషయం గమనించని జీనత్ ఇంటికి వచ్చాక చూసుకుంటే ఫోన్ లేదు.ఫోన్ పోయిందని టెన్షన్ పడలేదు,హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి పరిగెత్తలేదు. ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే తన గూగుల్‌ అకౌంట్‌లో ‘మై యాక్టివిటీ’ ఓపెన్ చేసి.. లోకేషన్ చూసింది. తన ఫోన్‌లో ఏమేం యాక్టివిటీస్ జరిగాయో అన్నింటినీ గమనించింది.ఫోన్ కొట్టేసిన వ్యక్తి వాట్సాప్, ఫేస్ బుక్‌లను అప్ డేట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కాలా’ సినిమా పాటల కోసం సెర్చ్ చేశాడు.పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్‌లో దాదార్ నుంచి తిరువణ్ణమలైకి ఆదివారం రాత్రి 9.30 ని.లకు టికెట్ బుక్ చేసుకున్నాడు ఇదే ఆ వ్యక్తి చేసిన పెద్ద మిస్టేక్. టికెట్‌లో పీఎన్ఆర్ నంబర్‌, సీటు వివరాలను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఒక ఫొటో కూడా దిగాడు. చోరీ చేసిన వ్యక్తిని సెల్వరాజ్ శెట్టిగా గుర్తించింది.

The Mobile Thief Catched By My Activity In Andheri-

ఈ వివరాలన్నింటితో వెంటనే దాదర్‌ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మొబైల్ ‘ఐఎంఈఐ’ నంబర్ .. తన వివరాలు అన్నింటినీ ఇచ్చింది.ఈ పనులు చేస్తునూ మరో వైపు లొకేష్‌ను కూడా ట్రాక్ చేస్తోంది. దాదార్ నుంచి రైలు బయలుదేరుతుందనగా.. ట్రెయిన్‌లో తన సీటులో కూర్చున్న సెల్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు.దొంగతనం నేను చేయలేదంటూ మొదట బుకాయించిన సెల్వరాజ్ చివరికి తప్పు ఒప్పుకున్నాడు.టెక్నాలజిపై అవగాహన ఉంటే దొంగలను పట్టుకోవడం పెద్ద ఇబ్బంది కాదని నిరూపించింది జీనత్.సమయస్పూర్తి,తెలివితేటలతో పోగొట్టుకున్న తన ఫోన్ ని సొంతం చేసుకుంది.