ఫోటో తెచ్చిన తంట‌..క‌ష్టాల్లో ప్రేమ‌జంట‌     2018-08-28   11:11:26  IST  Sai Mallula

మ‌మ్మ‌ల్ని చంప‌డం ద్వారా మీరేం పొందుతారు…! నా ప్రేమ‌ను స‌మాధి చేసుకోవ‌డం నాకిష్టం లేదు, మా పెళ్ళినాటి ఫోటో ఓ ఫ్రేమ్ గా మిగిలిపోవ‌డం మాకిష్టం లేదు….నాకు ఆమె ఇష్టం, ఆమెకు నేను ప్రాణం…మ‌తాల ప్ర‌స్తావ‌నను మా ప్రేమ‌లోకి లాగ‌కండి…మా అంత‌ట మ‌మ్మ‌ల్ని ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వండి….అంటూ కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌కుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న బాధ‌ను పంచుకున్నాడు.

The Lovers Hot Selfie Creates Problem In Kerala-

The Lovers Hot Selfie Creates Problem In Kerala

కేర‌ళ‌లోని అట్టింగ‌ల్ ప్రాంతానికి చెందిన హ్యారీస్ క్రిస్టియ‌న్ మ‌త‌స్థుడు, అత‌ను షాహానా అనే ఓ ముస్లీం అమ్మాయిని ప్రేమించాడు. 10 రోజుల క్రితం ఇద్ద‌రూ ఇంటి నుండి పారిపోయి పెళ్ళిచేసుకున్నారు. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ‌గానే…అమ్మాయి త‌ర‌ఫు బందువులు హ్యరీస్ ను బెదిరించ‌డం స్టార్ట్ చేశారు. హ్యారీస్ వాళ్ళ పేరెంట్స్ ను కూడా బెదిరించ‌డంతో…హ్యారీస్ పోలీసుల‌ను ఆశ్రయించాడు.!

The Lovers Hot Selfie Creates Problem In Kerala-

ఇటీవ‌లే వివాహం చేసుకున్న ఆ జంట త‌మ‌కొచ్చిన క‌ష్టాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. సోష‌ల్ మీడియా నుండి ఈ జంట‌కు ఫుల్ స‌పోర్ట్ ల‌భిస్తోంది. అయితే…. ఈ ప్రేమ నిజ‌మే అయితే మంచిదే …కానీ ఇద్ద‌రి వయ‌స్సు 20 లోపు కావ‌డమే ఈ బంధం క‌ల‌కాలం నిలుస్తుందా? అనేది డౌట్ అంటున్నారు కొంత‌మంది.!!