జనసేనలో కుల రాజకీయం జరుగుతోందా ..?అక్కడ వెనకడుగుకు కారణం అదేనా ..?   The Janasena Party Not Participating In The Telangana Over Kapu Votes     2018-09-19   15:27:26  IST  Sai M

రాజకీయాల్లో నీతులు చెప్పే నాయకులు కనిపిస్తుంటారు కానీ వాటిని పాటించే వారు మాత్రం కనిపించరు. ఎందుకంటే అలా చెప్పినవన్నీ పాటిస్తూ ముందుకు వెళ్తే రాజకీయాల్లో వెనక్కి పోవడమే జరుగుతుంది. ఈ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోడు. ఇక్కడ రాజకీయాలను శాసించేది డబ్బు .. కులమే. ఈ విషయంలో పవన్ కూడా ఇదే ఫాలో అయిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ తన కులాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తున్నాడా? అంటే అవును అని చెప్పక తప్పదు. జనసేన లో చూస్తే ఎక్కువ కాపు కులస్తులే కనిపిస్తారు. ఆ పార్టీ కి మద్దతు దారులు కూడా కాపులే కన్పిస్తారు. ఈ విషయంలో పవన్ తీరును పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరమే లేదు.

కాకపోతే ఏపీలో ఇంకా సరైన బలం పుంజుకొని జనసేన మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధం అయిపోతోంది. అంతే కాదు అస్సలు బలం లేని తెలంగాణాలో కూడా పోటీ చేస్తా అంటూ పవన్ ప్రకటనలు గుప్పించాడు. అది సాధ్యమా అంటే సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే.. పవన్ పూర్తిగా తన కులాన్నే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణలో పట్టు లేని ఆ పార్టీ కి ఏపీలో ఎందుకు ఇంత ప్రాధాన్యత వుంది అంటే అక్కడ కుల ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారు ఉండటమే కారణం. కానీ తెలంగాణాలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

జనసేన వర్గాల సమాచారం ప్రకారం ఏపీ లో బలం గా ఉన్న ఆ పార్టీ తెలంగాణాలో పోటీ చెయ్యడం లేదు. దానికి గల కారణాలు ఏంటి అంటే, తెలంగాణా ప్రాంతంలో తటస్థంగా ఉండాలి అని ఆ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే అసలు తెలంగాణాలో పవన్ పోటీ చెయ్యకపోవడానికి అసలు కారణం కాపు వర్గమేనా అంటే అవును అన్నే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపులను నమ్ముకునే రాజకీయం చేస్తున్నారని కానీ అక్కడ ఆ సామజిక వర్గం పెద్దగా లేకపోవడం తో తెలంగాణాలో దూరంగా ఉంటె బెటర్ అన్న ధోరణిలో పవన్ ఆలోచన.

The Janasena Party Not Participating In Telangana Over Kapu Votes-

అదీ కాకుండా… పవన్ తెలంగాణాలో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ పై పడుతుంది అందుకే పవన్ మెల్లగా తెలంగాణా నుంచి తప్పుకున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో మొదట పవన్ వాపక్షాలతో కలసి ప్రత్యేక కూటమి ఏర్పాటు చెయ్యాలి అని భావించినప్పటికీ ఆ తర్వాత పవన్ అసలు వామపక్షాలను పట్టించుకోవడం లేదు. వామపక్షాలు పవన్ కు స్నేహ హస్తం అందిస్తున్నా పవన్ దూరంగా ఉంటున్నాడు. దీనంతటికి కారణం తెలంగాణ ఎన్నికల్లో దూరంగా ఉందామని పవన్ బలంగా ఫిక్స్ అవ్వడమే కారణంగా తెలుస్తోంది.